శివరాజ్ కుమార్, అభిషన్ జీవింత్.. 'పికాసో' ఫస్ట్ లుక్
ABN, Publish Date - Sep 09 , 2026 | 09:30 AM
శివరాజ్ కుమార్, అభిషన్ జీవింత్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రానికి 'పికాసో అనే టైటిల్ ఖరారు చేశారు.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (Shivarajkumar), నెక్స్ జనరేషన్ స్టార్ అభిషన్ జీవింత్ (Abishan Jeevinth) ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రానికి పికాసో (Picasso) అనే టైటిల్ ఖరారుచేశారు. డెబ్యూ డైరెక్టర్ గౌతమ్ శివరామన్ (Gowtham Sivaraman) దర్శకుడు.
డ్రామా కంపెనీ సమర్పిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్ ఓ విలక్షణమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా రిలీజ్ చేశారు. విభిన్నమైన విజువల్స్ ప్రతి ఒక్కరినీ ఆకర్షి స్తోంది. శివరాజ్ కుమార్, అభిషన్ జీవింత్ తెల్లటి పట్టు వస్త్రాలు ధరించి పేలుతున్న టపాకాయల మధ్య కూర్చొని పొగ తాగుతున్న స్టీల్ ఆకట్టుకుం టోంది.
తెలుగమ్మాయి లిటిల్ హార్ట్స్ ఫేం శివాని నాగరం హీరోయిన్‌గా పరిచయమవుతుండగా, యోగలక్ష్మి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ గాయకుడు గాన వినోద్ ఈ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాణ పనులను జరుపుకుంటుంది.