సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నన్ను ఒంటరిగా వదిలేసింది.. శ్వాసిక తీరుపై విజయ్ ఆంటోని అసంతృప్తి

ABN, Publish Date - Jul 02 , 2026 | 02:57 PM

సినిమా ఎంత మంచి కంటెంట్‌తో వచ్చినా ప్రేక్షకులకు చేరకపోతే విజయాన్ని అందుకోవడం కష్టమే అందుకు వంద దేవుళ్లు సినిమానే ఉదాహ‌ర‌ణ‌.

swasika

సినిమా ఎంత మంచి కంటెంట్‌తో వచ్చినా ప్రేక్షకులకు చేరకపోతే విజయాన్ని అందుకోవడం కష్టమే. ప్రస్తుతం విజయ్ ఆంటోని (Vijay Antony) నటించిన 'నూరు సామి' తెలుగులో 'వంద దేవుళ్లు' (Vanda Devullu) విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విడుదల తర్వాత సినిమాకు స‌ర్వ‌త్రా పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విఫలమైన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అస‌లు సినిమా వ‌చ్చింది పోయిందనే విషయం కూడా తెలియ‌ని స్థాయిలో ఈ మూవీ ప్ర‌చారం సాగిందంటే ప‌రిస్థితి ఏంటో అర్థ‌మ‌వుతుంది. దాంతో రెండు రాష్ట్రాల‌లో సినిమా వసూళ్లపై ప్రభావం భారీగానే ప‌డింది. దీంతో మేక‌ర్స్ నిరాశ‌లో ఉండిపోయారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌ధారిణి చేసిన ప‌ని పుండు మీద కారం చల్లిన‌ట్లైంది.

వివ‌రాల్లోకి వెళితే.. ఇటీవల మోహన్‌లాల్‌తో కలిసి శ్వాసిక (Swasika Vijay) ఓ కార్య‌క్ర‌మంలో చేసిన డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో భారీగా వైర‌ల్ అయ్యాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో లక్షలాది వ్యూస్ సాధించి ట్రెండ్ అయ్యాయి. ఈ అంశ‌మే వంద దేవుళ్లు మేక‌ర్స్‌ను ఆగ్ర‌హానికి గురి చేసింది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ విజయానికి కీలక మారిన నేపథ్యంలో.. హీరోతో పాటు హీరోయిన్ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటేనే ఓ మోస్త‌రుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లే అవ‌కాశం ఉంటుంది. అలాంటిది సినిమా ప్ర‌మోష‌న్‌ను వ‌దిలేసి త‌న సొంత ప‌నులు చ‌క్క‌బెట్టుకోవ‌డంపై . హీరోయిన్ శ్వాసిక వ్య‌వ‌హర శైలిపై హీరో, నిర్మాత విజ‌య్ ఆంటోని అసంతృప్తి వ్యక్తం చేశారు.

సినిమా విడుదల సమయంలో మొత్తం టీమ్ కలిసి ప్రచారం చేయాల్సి ఉంటుంద‌ని.. ముఖ్యంగా హీరోయిన్లు కూడా ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటే సినిమా ప్రేక్ష‌కుల‌కు మరింత చేరువ అవుతుందని అభిప్రాయపడ్డారు. కానీ ఓ వైపు థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతున్న సినిమా కోసం స‌మ‌యం ఇవ్వ‌కుండా శ్వాసిక ఓ ప్రైవేట్ ఫంక్ష‌న్‌లో మోహన్‌లాల్‌తో కలిసి డాన్స్ పెర్ఫార్మెన్స్‌ కి ప్రాధాన్యం ఇవ్వడం తనను నిరాశకు గురి చేసిందని అన్నారు. శ్వాసిక డ్యాన్స్ వీడియో మా సినిమాకు ప్రచార పరంగా పెద్దగా ఉపయోగం కూడా కాలేదనే అభిప్రాయాన్ని విజయ్ ఆంటోని వ్యక్తం చేశారు. ఓ ద‌శ‌లో శ్వాసికతో పాటు మోహన్‌లాల్‌పై కూడా తనకు కోపం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవగా ఈ అంశంపై శ్వాసిక ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి:

ఎట్ట‌కేల‌కు.. విజయ్ 'జన నాయగ‌న్' సెన్సార్ పూర్తి?

Kayadu Lohar: టెన్త్ క్లాస్‌లోనే అంత పని చేసిందా?

వైజయంతీ మూవీస్ బ్యానర్ రూటే వేరు.. బ్రాండ్ అంటే ఇది!

Updated Date - Jul 02 , 2026 | 03:53 PM