జైలర్ -2.. తప్పుకొన్న షారుఖ్ ఖాన్
ABN, Publish Date - Apr 09 , 2026 | 11:34 AM
తలైవా రజనీకాంత్‌కు (Rajanikanth) బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh khan) పెద్ద అభిమాని. తలైవాపై తనకున్న అభిమానాన్ని ఎన్నో సందర్భాల్లో చాటుకున్నారు.
తలైవా రజనీకాంత్‌కు (Rajanikanth) బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh khan) పెద్ద అభిమాని. తలైవాపై తనకున్న అభిమానాన్ని ఎన్నో సందర్భాల్లో చాటుకున్నారు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాలో తలైవా పేరుతో ఓ పాటనే పెట్టారు. అయితే ఓ విషయంలో మాత్రం షారుక్ తలైవాకు షాక్ ఇచ్చారు. రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘జైలర్ 2’ (Jailer 2) సూపర్ డూపర్ హిట్టైన జైలర్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోంది. ఈ సినిమాలో షారుఖ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని చాలారోజులుగా టాక్ నడుస్తోంది. జైలర్ ఫస్ట్ పార్టు క్లైమాక్స్‌లో మోహన్‌లాల్, శివన్న కనిపించి సందడి చేసిన సంగతి తెలిసిందే. జైలర్-2 అలాంటి సన్నివేశంలో మూడో వ్యక్తి కోసం షారుఖ్ ను అనుకున్నారు. ఆయనను సంప్రదించగా అంగీకరించారు. ఆ కామియో కోసం ఐదు రోజులు డేట్లు కూడా సర్దుబాటు చేశారట. తాజా సమాచారం ప్రకారం షారుఖ్ ఈ సినిమాలో లేరని తెలిసింది. షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ‘కింగ్’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో ఆయన లుక్ రివీల్ కాకూడదని, ప్రస్తుతం ఆ సినిమాతో బిజీగా ఉండటం వల్లే జైలర్-2 విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ సినిమాతో షారఖ్ కూతురు సుహానా ఖాన్ బిగ్ స్క్రీన్ పై సందడి చేయనున్నారు. అయితే తలైవాతో ఉన్న అనుబంధం రీత్యా షారుఖ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో భాగమవుతానని రజనీకి మాటిచ్చినట్లు తెలిసింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.