Bigg Boss 9 Tamil: బిగ్‌బాస్ తమిళ.. విన్నర్‌గా తెలుగు సీరియల్ నటి
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:52 AM
గడిచిన 100 రోజులుగా నడుస్తున్న తమిళ బిగ్ బాస్ (Bigg Boss Tamil9) కు ఎండ్ కార్డ్ పడింది.
గడిచిన 100 రోజులుగా నడుస్తున్న తమిళ బిగ్ బాస్ (Bigg Boss Tamil9) కు ఎండ్ కార్డ్ పడింది. విజయ్ సేతుపతి హోస్ట్‌గా చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ సీజన్‌లో చివరకు దివ్య గణేశ్ (Divya Ganesh) విన్నర్‌గా నిలిచింది. ఇప్పటివరకు తెలుగు బిగ్‌బాస్‌లో మహిళలు ఎవరు విన్నర్ కాకపోయినా తమిళంలో మాత్రం ముచ్చటగా మూడోసారి అమ్మాయి కప్ సొంత చేసుకోవడం విశేషం. వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన దివ్య, తన ఆటతీరు, మాటల శైలి, నాయకత్వ లక్షణాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఫైనల్‌గా విన్నర్‌గా నిలిచి ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్ మనీని కూడా సొంతం చేసుకుంది.
ఈ విజయం తర్వాత దివ్య గణేషన్ ఎవరు?, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనే ఆసక్తి నెటిజన్లలో పెరిగింది. ఈ ముగ్గుగుమ్మ విషయాల దగ్గరకు వస్తే.. 1994 సెప్టెంబర్ 12న జన్మించిన దివ్య గణేషన్ బాల్యం తమిళనాడు రామనాథపురంలో గడిచింది. చిన్ననాటి నుంచే మోడలింగ్, నటనపై ఆసక్తి పెంచుకున్న దివ్య, చదువు పూర్తయ్యాక మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2015లో కేలడి కన్మణి అనే తమిళ సీరియల్‌తో నట జీవితం ప్రారంభించి ఆపై వరుస సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది.
ముఖ్యంగా విన్నైతాండి వరువాయా, లక్ష్మీ వందచు వంటి సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించింది. అంతేగాక.. 2019లో భాగ్యరేఖ సీరియల్‌తో తెలుగు టీవీ ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. అనంతరం సుమంగళి, భాగ్యలక్ష్మి, చెల్లెమ్మ వంటి పలు సీరియల్స్‌లో నటించి అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.