భాను ప్రియ.. ఇంట్లో తీవ్ర విషాదం
ABN , Publish Date - Mar 23 , 2026 | 05:19 PM
అలనాటి హీరోయిన్లు భానుప్రియ . శాంతి ప్రియ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
అలనాటి హీరోయిన్లు భానుప్రియ )Bhanupriya). శాంతి ప్రియ (Shanthipriya) కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వారి తల్లి గారు, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న లక్ష్మి (M Lakshmi) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయస్సు 83 సంవత్సరాలు. లక్ష్మి గారి అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు భానుప్రియ, శాంతిప్రియతో పాటు కుమారుడు గోపీ కృష్ణ ఉన్నారు. భానుప్రియ ఆమె సోదరి శాంతి ప్రియకు తల్లి లక్ష్మి తొలి నుంచి బ్యాక్ బోన్‌గా నిలుస్తూ వచ్చారు. లక్ష్మి గారి మృతికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే భానుప్రియ రెండేండ్ల క్రితం శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన అయలాన్ సినిమాలో తల్లి పాత్రలో నటించారు.
