Arjun Das: రహస్యంగా.. ఓజీ అర్జున్ దాస్ నిశ్చితార్థం?

ABN , Publish Date - May 29 , 2026 | 08:24 AM

తమిళ చిత్ర పరిశ్రమలో తన నటన, తన వాయిస్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని, విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన అర్జున్ దాస్.

Arjun Das

తమిళ చిత్ర పరిశ్రమలో తన నటన, తన వాయిస్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని, విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన అర్జున్ దాస్ (Arjun Das) రహస్యంగా నిశ్చితార్థం జరిగినట్టు కోలీవుడ్లో ప్రచారం సాగుతోంది.

కార్తి హీరోగా నటించిన 'ఖైదీ' చిత్రంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ దాస్.. 'మాస్టర్, 'అనీతి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ', తెలుగులో ఓజీ వంటి పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయ‌న హీరోగా నటించిన 'కాన్ సిటీ' చిత్రం వచ్చే నెలలో విడుదలకానుంది.

ఇదిలావుంటే, అర్జున్ దాస్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మితో రిలేషన్‌తో ఉన్నట్టు గతంలో ప్రచారం కాగా, దీన్ని ఆర్జున్ దాస్ స్వయంగా ఖండించారు. ఇపుడు అర్జున్ దాస్ సీక్రెట్‌గా నిశ్చితార్థం జరిగిందని, త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ నేప‌థ్యంలోనే ఆయన బృందం స్పందించింది. 'అర్జున్ దాస్ నిశ్చితార్థం, వివాహంపై సాగుతున్న ప్రచారంలో నిజం లేదని, ఇలాంటి వార్తలను ప్రచురించే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని కోరుతున్నాం' అని తెలిపారు.

ఇది కూడా చదవండి:

Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ

System Movie Review: సోనాక్షి సిన్హా, జ్యోతిక 'సిస్టమ్‌' ఓటీటీ మూవీ రివ్యూ

Updated Date - May 29 , 2026 | 02:20 PM