సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సీక్రెట్ పెళ్లి.. కవల పిల్లలు? పుకార్లకు త్రిష మాస్ వార్నింగ్!

ABN, Publish Date - Apr 07 , 2026 | 09:03 PM

సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు ప్రతిరోజూ చర్చనీయాంశంగా మారుతున్నాయి.

trisha

సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు ప్రతిరోజూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండియన్ క్వీన్, ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష (Trisha) గురించి వస్తున్న వార్తలు నెట్టింట ఎప్పుడూ హాట్ టాపిక్కే. గత కొన్ని రోజులుగా త్రిష పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న పుకార్లు అన్నీ ఇన్నీ కావు. దళపతి విజయ్ (thalapathy vijay) విడాకుల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి త్రిష పేరు ఏదో ఒక రకంగా వినిపిస్తూనే ఉంది.

ఇక తాజాగా ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందని, ఒక బడా వ్యాపారవేత్తను సీక్రెట్‌గా పెళ్లి చేసుకోబోతోందని రకరకాల కథనాలు అల్లారు. ఈ రూమర్ల డోస్ మరీ ఎక్కువ కావడంతో, ఎప్పుడూ కూల్‌గా ఉండే త్రిష ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. తనపై అబద్ధాలు రాసేవారికి తనదైన శైలిలో చురకలు అంటించారు.

అసలు విషయం ఏమిటంటే.. త్రిష ఇండస్ట్రీలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటుతున్నా, ఇప్పటికీ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్నారు. అయితే ఆమె పెళ్లి గురించి మాత్రం ఎప్పుడూ ఏదో ఒక గాసిప్ వినిపిస్తూనే ఉంటుంది. ఇటీవల విజయ్‌తో కలిసి నటించిన సినిమాల కారణంగా వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియా కోడై కూసింది.

దీనికి తోడు విజయ్ తన భార్యకు విడాకులు ఇస్తున్నారనే వార్తలు తోడవడంతో త్రిషను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు కొందరు నెటిజన్లు. కేవలం వ్యక్తిగత విషయాలే కాకుండా, త్రిష ఇక సినిమాల్లో నటించరని, సైలెంట్‌గా మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోతారని కూడా ప్రచారం చేశారు. ఇలా రోజుకో కొత్త అబద్ధం పుట్టుకొస్తుండటంతో త్రిష సహనం నశించింది.

తనపై జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న త్రిష, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. సాధారణంగా ఇలాంటి వార్తలు వస్తే ఖండించడం లేదా మౌనంగా ఉండటం సెలబ్రిటీల లక్షణం. కానీ త్రిష మాత్రం రూమర్ రాయుళ్లను వెటకారంతో ఉతికి ఆరేశారు.

"నేను సినిమాలకు గుడ్ బై చెప్పేశానట.. ఒక రిచ్ బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకున్నానట.. అంతేకాదు, మాకు పుట్టిన నలుగురు పిల్లలకు నిన్నే రెండేళ్లు కూడా నిండాయట! ఇవి కాకుండా ఇంకా ఏమైనా కొత్త ముచ్చట్లు యాడ్ చేయాలా? లేక ఈ రోజుకి మీ కల్పిత కథల కోటా పూర్తయిందా?" అంటూ ఒక స్మైలీ ఎమోజీని జత చేశారు.

అంటే, తన గురించి వస్తున్న వార్తలన్నీ కేవలం కల్పిత కథలేనని, వాటిలో ఎటువంటి వాస్తవం లేదని ఒకే ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చేశారు. త్రిష ఇచ్చిన ఈ మాస్ కౌంటర్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. "అబద్ధాలు రాసేవాళ్ల పరువు తీసేశావు త్రిష", "నీ రేంజ్ ఇదే" అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - Apr 07 , 2026 | 09:07 PM