Dhanush: సంజన అవుట్.. 'ప్రేమలు' బ్యూటీ ఇన్?
ABN, Publish Date - Jul 16 , 2026 | 03:04 PM
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రంలో హీరోయిన్ ను మారుస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న 'ఓం' చిత్రంలో నటిస్తున్న ఆయన, ఆ సినిమా పూర్తయ్యాక దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తుతో ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేయనున్నారు. ఆ తర్వాత మారి సెల్వరాజ్ (Mari Selvaraj) దర్శకత్వంలో హిస్టారికల్ మూవీ, అలాగే వెట్రిమారన్ తెరకెక్కించనున్న ప్రతిష్ఠాత్మక 'తమిళ్ మురుగన్' చిత్రాలు కూడా ధనుష్ లైనప్‌లో ఉన్నాయి. 'ఓం' షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో తమిళరసన్ పచ్చముత్తు తన కొత్త సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హీరోయిన్ ఎంపికపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ సినిమాలో 'లబ్బర్ పందు' ఫేమ్ సంజనను కథానాయికగా తీసుకోవాలని దర్శకుడు భావించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు ఆమె స్థానంలో 'ప్రేమలు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మమిత బైజును తీసుకోవాలని దర్శకుడికి ధనుష్ సూచించినట్లు కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఈ వార్త వైరల్ కావడంతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంజనకు ఈ అవకాశం దక్కి ఉంటే ఆమె కెరీర్‌కు పెద్ద ప్లస్ అయ్యేదని, ఇప్పుడు మంచి అవకాశం కోల్పోతుందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. హీరోయిన్ ఎంపిక విషయంలో హీరో అభిప్రాయం కూడా ముఖ్యమేనని మరికొందరు అభిమానులు అంటున్నారు. 'ప్రేమలు' హీరోయిన్‌కు ఉన్న క్రేజ్, మార్కెట్ కూడా సినిమాకు ఉపయోగపడుతుందని టీం భావించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ మాత్రమే ఇది. అంతా ఓకే ఐతే త్వరలోనే అప్డేట్ రావొచ్చు.