Samantha: సమంత మళ్లీ ఓటీటీలోకి.. ఆ షో ఎంటంటే..
ABN, Publish Date - Jul 04 , 2026 | 03:05 PM
‘మా ఇంటి బంగారం’ చిత్రంతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారు సమంత . ప్రస్తుతం సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న సామ్ అభిమానులకు రెండు శుభవార్తలు చెప్పారు.
‘మా ఇంటి బంగారం’ చిత్రంతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారు సమంత (Samantha). ప్రస్తుతం సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న సామ్ అభిమానులకు రెండు శుభవార్తలు చెప్పారు. తాను తల్లి కాబోతున్నట్లు ప్రెగ్నెన్సీని కన్‌ఫామ్ చేశారు. అలాగే మరో కొత్త జర్నీని ఆమె ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రముఖ ఓటీటీ సోనీలివ్‌తో ఆమె కొత్త జర్నీ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆమె ఆహా’ ఓటీటీ కోసం 'సామ్‌జామ్' షోకు హోస్ట్‌గా వ్యవహరించి సక్సెస్ చేశారు. ఇప్పుడు అలాంటి మరో షోతో సందడి చేయడానికి సామ్ రెడీగా ఉన్నారని తెలిసింది. సోనీ లివ్ తమిళ్‌తో (Sonyliv Tamil) కలిసి ఓ కొత్త ప్రాజెక్ట్‌ను సమంత ప్రకటించించారు. అది షోనా, లేక ఇంకేదన్నాన అన్నది తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆమె చేయబోయేది రియాలిటీ షోలాంటిదని సామ్ సన్నిహితులు చెబుతున్నారు, అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు.
సమంత మాట్లాడుతూ 'ఈ ఏడాది నాకు ఎన్నో విషయాలు నేర్పింది. మార్పులను స్వీకరించడం, కొత్త ఆరంభాలు ఆహ్వానించడం నేర్చుకున్నా. సోనీ లివ్ తమిళ్‌తో ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నాం. త్వరలోనే అందరితో పంచుకుంటాను’ అని తెలిపారు.
ప్రస్తుతం సమంత గర్భవతిగా ఉన్నారు. ఈ షూటింగ్ ఇప్పుడు చేస్తారా? లేదా ప్రసవం అయిన తర్వాత చేస్తారా అన్నది చూడాలి.