సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sakshi Agarwal: చిరకాల స్వప్నం సాకారమైంది

ABN, Publish Date - Jul 21 , 2026 | 09:07 AM

నటి సాక్షి అగర్వాల్‌ తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. నటిగా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు వ్యాపారవేత్తగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.

నటి సాక్షి అగర్వాల్‌ తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. నటిగా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు వ్యాపారవేత్తగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఎంతోకాలంగా శ్రమించి రూపొందించిన 'ఓకూ (Oku)' అనే ప్రీమియం పెర్ఫార్మెన్స్ న్యూట్రిషన్ కంపెనీని అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా సాక్షి మాట్లాడుతూ 'ఈ ప్రాజెక్టు కోసం గత ఐదేళ్లుగా పరిశోధన, ఉత్పత్తి అభివృద్ధి, నాణ్యత ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాను. అంచనాలకు అనుగుణంగా అత్యుత్తమ నాణ్యతతో ఉత్పత్తులను రూపొందించేందుకు నిరంతరం కృషి చేశాను. ప్రస్తుతం మార్కెట్లో అనేక పోషకాహార ఉత్పత్తులకు సినీ ప్రముఖులు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తుంటే నా ప్రోడక్ట్ కు నేనేప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉంది. సినిమా షూటింగ్‌లతో పాటు ఫిట్‌నెస్‌ను సమతుల్యం చేసుకుంటూ ఈ ప్రయాణాన్ని కొనసాగించాను. దేశ ప్రజలకు నాణ్యమైన, విశ్వసనీయమైన పోషకాహార ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించాను. ఎన్నో ఏళ్లుగా నేను కలగన్న స్వప్నం నేడు నిజమైంది' అని అన్నారు. 

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన సాక్షి అగర్వాల్‌, తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 'రాజా రాణి', 'కాలా', 'విశ్వాసం', 'సిండ్రెల్లా', 'టెడ్డి', 'అరణ్మనై 3', 'ది నైట్' వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. అలాగే 'బిగ్‌బాస్ తమిళ్' రియాలిటీ షోలో పాల్గొని మరింత ప్రజాదరణ పొందారు. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను కూడా ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 

Updated Date - Jul 21 , 2026 | 09:32 AM