Sai Pallavi: ‘మారి 2’ తర్వాత మరోసారి.. జత కట్టారు
ABN, Publish Date - Feb 03 , 2026 | 10:15 AM
‘మారి2’ చిత్రంతో అలరించారు ధనుష్ (Dhanush), సాయి పల్లవి (Sai pallavi) జోడి. ఈ సినిమాతో హిట్ జోడి అనిపించుకున్నారు. ఈ జంట మరోసారి వెండి తెరపై మేజిక్ చేయబోతున్నారు.
‘మారి 2’ చిత్రంతో అలరించారు ధనుష్ (Dhanush), సాయి పల్లవి (Sai pallavi) జోడి. ఈ సినిమాతో హిట్ జోడి అనిపించుకున్నారు. ఈ జంట మరోసారి వెండి తెరపై మేజిక్ చేయ బోతున్నారు. ధనుష్ ‘డీ 55’ (D55-వర్కింగ్ టైటిల్) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్‌కుమార్ పెరియసామి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఓ కథానాయికగా శ్రీలీల నటిస్తున్నట్లు ఇటీవల వెల్లడించింది చిత్రబృందం. తాజాగా ఈ చిత్రంలో మరో నాయికగా సాయి పల్లవి ని ఎంపిక చేశారు.
సోమవారం ఈ విషయాన్ని తెలుపుతూ.. ఇన్‌స్టా వేదికగా ఫొటోలను పంచుకున్నాయి చిత్రవర్గాలు. ‘ఆమె సౌందర్యానికి, బలానికి ప్రతీక. అందరి అభిమాన తార సాయిపల్లవికి ‘డీ 55’ ప్రాజెక్ట్‌లోకి స్వాగతం’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలిసింది. వాస్తవ సంఘటనల ఆధారంగానే దీన్ని రూపొందిస్తున్నారని, ఇందులో ధనుష్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని సాయి అభయంకర్ స్వరకర్త. త్వరలోనే సాయి పల్లవి సెట్స్ లో అడుగుపెట్టనుంది.