మణిరత్నం.. విజయ్ సేతుపతి.. సాయి పల్లవి.. ఓ ఫ్యామిలీ డ్రామా

ABN , Publish Date - Feb 23 , 2026 | 08:11 PM

లెజెండరీ దర్శకుడు మణిరత్నం మరోసారి క్రేజీ కాంబినేషన్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

లెజెండరీ దర్శకుడు మణిరత్నం మరోసారి క్రేజీ కాంబినేషన్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వరుస డిజాస్టర్లతో కొంత వెనకబడ్డ ఆయన, 'ఒకే బంగారం' తో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చారు. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. తదుపరి 'థగ్‌ లైఫ్‌'తో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. ఇప్పుడు ఆయన మళ్లీ ఓ సరికొత్త కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఈసారి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కబోయే చిత్రానికి విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని హీరోగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. సహజమైన  నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న సాయి పల్లవి ఈ చిత్రంలో కథానాయికగా నటించబోతోందని టాక్ నడుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ  లైకా  ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించబోతోందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, కథా నేపథ్యం వంటి అంశాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిసింది 

Updated Date - Feb 23 , 2026 | 08:59 PM