సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హోంబలేతో తెగిపోయిన బంధం...

ABN, Publish Date - Mar 28 , 2026 | 10:16 AM

'కాంతారా' సీరిస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్‌ శెట్టికి, హోంబలే ఫిల్మ్స్ కు మధ్య లుకలుకలు ఏర్పడినట్టు శాండిల్‌వుడ్‌ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.

Rishab Shetty

తనను వెలుగులోకి తెచ్చిన సొంత బ్యానర్‌నే రిషబ్ శెట్టి వద్దనుకున్నారా? కన్నడ పరిశ్రమలో ఎంతో కాలంగా కొనసాగుతున్న ఆ ముగ్గురు మొనగాళ్ల బంధానికి బీటలు వారాయా? 'కాంతార' సినిమాతో వెండితెరపై దైవ స్వరూపాన్ని చూపించిన రిషబ్, ఇప్పుడు సోషల్ మీడియాలో సడెన్‌గా ఒక సైలెంట్ బాంబ్ పేల్చారు. ఫోన్ స్క్రీన్ మీద ఒకే ఒక్క అన్‌ఫాలో క్లిక్.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రిషబ్ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి!?

సాధారణంగా స్టార్ హీరోలు తమ సినిమాలను నిర్మించే బ్యానర్లతో ఎంతో క్లోజ్‌గా ఉంటారు. కానీ రిషబ్ శెట్టి సీన్ రివర్స్ చేశారు. 'కెజిఎఫ్, సలార్, కాంతార' లాంటి భారీ చిత్రాలను అందించిన హోంబలే ఫిల్మ్స్‌ను ఆయన సడెన్‌గా అన్‌ఫాలో చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ప్రొడక్షన్ హౌస్‌నే కాదు, తన ప్రాణ స్నేహితుడు, కన్నడ స్టార్ రాజ్ బి. శెట్టిని, అలాగే హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌ను కూడా రిషబ్ లిస్ట్ నుంచి తొలగించారు. రిషబ్, రాజ్ బి. శెట్టి మధ్య ఉన్న అనుబంధం చాలా మందికి తెలిసిందే. ఒకరికొకరు వెన్నుదన్నుగా ఉంటూ ఎదిగిన ఈ జోడీ మధ్య ఇప్పుడు గ్యాప్ వచ్చిందా? లేక ఏదైనా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ కోసం చేస్తున్న సీక్రెట్ ప్లానా? అని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. వాస్తవానికి నాలుగేళ్ల క్రితం వరకు రిషబ్ అంటే కేవలం కన్నడ సినీ పరిధిలోనే గుర్తింపు ఉండేది. కానీ 'కాంతార' ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ రావడంతో రిషబ్ రేంజ్ మారిపోయింది. ఇటీవలే వచ్చిన 'కాంతార చాప్టర్ 1' కూడా అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది. ఇలాంటి టైంలో 'కాంతార 3' కోసం అంతా సిద్ధమవుతున్న వేళ, ఈ అన్‌ఫాలో వ్యవహారం చర్చనీయాంశమైంది.


అయితే రిషబ్ కెరీర్ గ్రాఫ్ ఇప్పుడు పీక్స్‌లో ఉంది. ప్రశాంత్ వర్మ మేకింగ్‌లో రాబోతున్న 'జై హనుమాన్' చిత్రంలో ఆయన హనుమంతుడిగా కనిపించబోతున్నారు. అంతేకాకుండా, ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలోనూ మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రెండు సినిమాలు కేవలం కన్నడ ఇండస్ట్రీకే కాదు, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయం. ఒకవైపు ఇలాంటి భారీ చిత్రాలు, మరోవైపు ఈ సోషల్ మీడియా వివాదాలు.. రిషబ్ చుట్టూ ఇప్పుడు ఏదో పెద్ద ప్లాన్ నడుస్తోందనేది వాస్తవం. మరి రిషబ్ శెట్టి చేసిన ఈ పని వెనుక అసలు కారణం ఏమై ఉంటుంది? నిజంగానే విభేదాలా లేక ఏదైనా సర్ప్రైజ్ ఉందా అనేది చూడాలి.

Updated Date - Mar 28 , 2026 | 10:17 AM