సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rukmini Vasanth: ఒక్క ఫోటోతో ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్

ABN, Publish Date - Jan 17 , 2026 | 07:48 PM

శాండల్ వుడ్ సెన్సేషన్ ఫ్యాన్స్ హార్ట్ ను బ్రేక్ చేసింది. ఒక్క ఫోటోతో వారి గుండెలపై గట్టిగా కొట్టేసింది. నిజమో అబద్ధమో తెలియదు కానీ... ఆ ఫోటో చూసినప్పటి నుంచి ఆమె అభిమానులు తెగ బాధపడిపోతున్నారు.

ఇండస్ట్రీలోకి వచ్చిన అతికొద్ది సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini vasanth). అటు కన్నడ, ఇటు తెలుగులో తనదైన నటనతో యువత గుండెల్లో గూడుకట్టుకుంది. తన డెబ్యూ మూవీ 'సప్త సాగరాలు దాటి'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రుక్మిణి, మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, 'కాంతార: చాప్టర్ 1'లో రిషబ్ శెట్టితో జతకావడంతో బ్యూటీ కెరీర్ మరో లెవల్‌కు చేరుకుంది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో రుక్మిణి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. ఈ సెన్సేషన్ బ్యూటీ గురించి తాజాగా ఓ న్యూస్ వైరల్ గా మారింది.

ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుసగా సినిమాలు సైన్ చేస్తున్న చిన్నది, యశ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్'లో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇలాంటి బిజీ షెడ్యూల్ మధ్యే రుక్మిణి వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా వచ్చిన ఒక ఫోటోలో ముద్దుగుమ్మ ఓ కుర్రాడిని హగ్ చేసుకున్నట్టు కనిపించడంతో రకరకాల కథలు మొదలయ్యాయి.

ఈ ఫోటోలో రుక్మిణి.. సిద్ధాంత్ నాగ్ అనే వ్యక్తితో సన్నిహితంగా కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు వివిధ రకాలుగా చర్చలు మొదలుపెట్టారు. కొందరు ఇది స్నేహితుల మధ్య సాధారణ క్షణమే అని అంటుంటే.. మరికొందరు ఇద్దరి మధ్య లవ్ అఫైర్ ఉందని ఊహిస్తున్నారు. రుక్మిణి కమిటెడ్ అని భావించిన చాలా మంది యంగ్ ఫ్యాన్స్ ఈ వార్తతో షాక్ అయ్యి.. సోషల్ మీడియాలో హార్ట్‌బ్రేక్ ఎమోజీలు, శాడ్ రియాక్షన్స్ పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు సిద్ధాంత్ నాగ్ ఎవరు? రుక్మిణి జీవితంలో ఆయన పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలు ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి.

Updated Date - Jan 17 , 2026 | 07:57 PM