కోలీవుడ్ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఆర్‌కే సెల్వమణి
ABN, Publish Date - Feb 10 , 2026 | 12:09 PM
కోలీవుడ్ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఆర్‌కే సెల్వమణి తమిళ చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడిగా దర్శకుడు ఆర్కే సెల్వమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తమిళ చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమణి (RK Selvamani) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా ఆర్‌వీ ఉదయకుమార్, కోశాధికారిగా పేరరసు, ఉపాధ్యక్షులుగా కేఎస్ రవికుమార్, పి.వాసు కూడా పోటీ లేకుండా ఎంపికయ్యారు. ఈ సంఘంలో మిగిలిన 5 జాయిట్ సెక్రటరీ, 17 కార్యవర్గ సభ్యుల పదవులకు ఈ నెల 15వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. వడపళనిలోని మ్యూజిక్ యూనియన్ ప్రాంగణంలో జరుగనున్న ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా రిటైర్డ్ న్యాయమూర్తి తర్వీష్ వ్యవహరించనున్నారు. ఎన్నికల్లో మొత్తం 1800 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే, ప్రధాన పదవులకు ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మిగిలిన పోస్టుల ఎన్నిక నామమాత్రంగా మారింది. అయితే ఇంతకుముందు ఆర్కే సెల్వమణి తమిళ దర్శకుల సంఘానికి సెక్రటరీగా ఉన్నారు. ఇప్పుడు. అధ్యక్ష పదవి ఆయన్ను వరించింది.