సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Soundarya Rajinikanth: నాన్న బయోపిక్‌కు.. ఆయన బాగుంటాడు

ABN, Publish Date - Oct 02 , 2026 | 06:47 AM

రజనీకాంత్‌ (Rajinikanth) జీవిత కథ త్వరలో పుస్తక రూపంలోకి రాబోతోంది.

Soundarya Rajinikanth, Rishikanth

‘మా డాడీ ఆత్మకథ రాస్తున్నారు. అది ఒక ముఖ్యమైన గ్రంథం అవుతుంది. అందులో చాలా విషయాలు ఉన్నాయి. దానిని త్వరలోనే పుస్తకంగా విడుదల చేస్తాం. ఈ బయోగ్రఫీని ఒక రామాయణం - ఒక మహాభారతంలా చూస్తున్నాను.

ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, ఒకే సూపర్‌స్టార్‌.. ఆయనే మా డాడీ. ఈ విషయాన్ని చెప్పేందుకు గర్వపడతాను’ అని రజనీకాంత్ (Rajinikanth) రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ (Soundarya Rajinikanth) అన్నారు.

ఆమె ఓ తమిళ ఛానల్‌తో మాట్లాడుతూ ‘ప్రస్తుతం నాన్న స్వీయ చరిత్ర విడుదలైన తర్వాత దాన్ని సినిమాగా లేదా వెబ్ సిరీస్‌గా తీసే ఆలోచన ఉంది. అందులో రిషికాంత్‌ హీరోగా నటిస్తే బాగుంటుందని కొందరు అంటున్నారు’ అని సౌందర్య వివరించారు.

Updated Date - Oct 02 , 2026 | 07:03 AM