Rishikanth: ఇండస్ట్రీకి మరో రజనీకాంత్ దొరికేశాడు..
ABN, Publish Date - Sep 20 , 2026 | 08:50 PM
ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు స్టార్ అవుతారు.. ఎవరు ఎప్పుడు జీరో అవుతారు అని చెప్పడం కష్టం. తాజాగా తమిళ చిత్రం మోద రాత్రి(Modha Rathri) ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి ఇంటర్నెట్‌లో ఒకటే పేరు మార్మోగిపోతోంది... అదే రిషికాంత్
ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు స్టార్ అవుతారు.. ఎవరు ఎప్పుడు జీరో అవుతారు అని చెప్పడం కష్టం. తాజాగా తమిళ చిత్రం మోద రాత్రి(Modha Rathri) ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి ఇంటర్నెట్‌లో ఒకటే పేరు మార్మోగిపోతోంది... అదే రిషికాంత్ (Rishikanth). చిన్న పాత్రలతో ప్రయాణం ప్రారంభించి, పర్‌ఫెక్ట్ లీడ్ యాక్టర్‌గా ఎదిగిన ఆయన నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్‌కు నెటిజన్లు, సినీ ప్రియులు బ్రహ్మరథం పడుతున్నారు. మోద రాత్రి చిత్రం ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చాక రిషికాంత్ డెడ్లీ ఎడిట్స్, మాస్ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.
సాధారణంగా చిత్రపరిశ్రమలో చాలామంది యంగ్ హీరోలు సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను అనుకరించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ వారు కేవలం రజనీ మ్యానరిజమ్స్, గ్లామర్, స్టైల్, స్వాగ్‌ను మాత్రమే కాపీ కొడుతుంటారు. అయితే రిషికాంత్ మాత్రం రజనీకాంత్ లోని అసలైన భావోద్వేగాన్ని పట్టుకున్నాడు. రజనీకాంత్‌కు ఉన్న అతిపెద్ద బలం ఆయన తెరపై ఏడ్చినా, భావోద్వేగానికి గురైనా.. ఆడియన్స్ కూడా ఆయనతో పాటు ఏడుస్తారు. సరిగ్గా ఆ ఎమోషనల్ సెంటిమెంట్‌ను, నేచురల్ యాక్టింగ్‌ను పర్ఫెక్ట్‌గా పండించగల అతికొద్దిమంది నటుల్లో రిషికాంత్ ఒకడని సినీ విమర్శకులు, ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.
వేరే ఇండస్ట్రీ నుంచి కొత్త నటులు వస్తే నెత్తిన పెట్టుకునే మనం, మన కోలీవుడ్‌లోనే ఉన్న ఇలాంటి గొప్ప ప్రతిభను గుర్తించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నామంటూ అభిమానులు సోషల్ మీడియాలో హాట్ కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ స్టార్ రేంజ్ స్వాగ్‌తో పాటు, గుండెలను పిండేసే ఎమోషన్‌ను పండించగల రిషికాంత్ టాలెంట్‌ను ఇన్నాళ్లూ తమిళ పరిశ్రమ సరిగ్గా వాడుకోలేదని, ఇప్పటికైనా కోలీవుడ్ డైరెక్టర్లు, యాక్టర్లు ఆయనను గుర్తిస్తుండటంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఒక సాధారణ సపోర్టింగ్ యాక్టర్ నుంచి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే స్థాయికి రిషికాంత్ ఎదిగాడు. కేవలం స్టైల్ మాత్రమే కాకుండా, ప్రేక్షకులను కంటతడి పెట్టించే ఎమోషనల్ కనెక్ట్ ఆయన సొంతం కావడంతో భవిష్యత్తులో ఆయన పెద్ద స్టార్ అవుతాడని కొందరు అంటుంటే.. ఇంకొందరు ఇండస్ట్రీకి మరో రజనీ కాంత్ దొరికాడని కామెంట్స్ చేస్తున్నారు.రజనీ ఫ్యాన్స్ అయితే.. సూపర్ స్టార్ బయోపిక్ లో రిషికాంత్ నటిస్తే బావుంటుందని, ఎలాగూ పేర్లు కూడా రైమింగ్ లో ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం తమిళ సినీ ప్లాట్‌ఫామ్‌లలో, సోషల్ మీడియా ట్రెండ్స్‌లో రిషికాంత్ పేరు ఒక రేంజ్‌లో ఊపేస్తోంది. మరి ఈ పేరును రిషికాంత్ ఎలా నిలబెట్టుకుంటాడో చూడాలి.