సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రేణుకాస్వామి కేసులో.. కొత్త మలుపు! దర్శన్‌ భార్య విజయలక్ష్మి పిటిషన్‌కు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ABN, Publish Date - Sep 20 , 2026 | 08:06 PM

రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడైన నటుడు దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు కీలక ఊరట కల్పించింది.

Darshan

చిత్రదుర్గ రేణుకాస్వామి ( Renukaswamy Murder Case) హత్యకేసులో విచారణా ఖైదీగా ఉన్న నటుడు దర్శన్ (Actor Darshan) తరుపున భార్య దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది. కేసుకు సంబంధించి ప్రధాన సాక్ష్యులను విచారణ జరిపే వేళ తనను తప్పనిసరిగా కోర్టుకు హాజరయ్యేలా అనుమతులు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు.

విచారణలు జరిపిన హైకోర్టు న్యాయమూర్తి వి. శ్రీశానంద అనుమతులు ఇచ్చారు. విచారణ కోర్టులో ఇదే వినతిని తిరస్కర ణకు గురైంది. దీంతో దర్శన్ తరుపున ఆయన భార్య విజయలక్ష్మి (Vijayalakshmi) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకూ వీడియో

కాన్ఫరెన్స్ ద్వారా విచారణలలో పాల్గొనే వారని పిటిషన్ లో పేర్కొన్నారు. కానీ కేసులో పలు మార్పులు జరుగుతు న్నాయని అప్రూవర్గా ఒకరు మారడం మరో ఇద్దరు సిద్ధమైన తరుణంలో ప్రధాన సాక్ష్యులను విచారించే వేళ స్వయంగా కోర్టుకు వచ్చే అనుమతులు ఇవ్వాలని కోరారు. అందుకు న్యాయస్థానం అంగీకరిం చింది. దీనిని బట్టి ఇకపై జరిగే కీలక వ్యక్తుల విచారణల వేళ దర్శ న్ కోర్టుకు వచ్చేందుకు వీలు కల్పించింది.

Updated Date - Sep 20 , 2026 | 08:54 PM