అభిమాని హత్య కేసు.. దర్శన్‌కు మరో బిగ్ షాక్
ABN, Publish Date - Oct 07 , 2026 | 07:13 AM
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో జైలులో విచారణ ఖైదీగా ఉన్న నటుడు దర్శన్ కు కోర్టు నుంచి మరో బిగ్ షాక్ తగిలింది.
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో (Renukaswamy Murder Case) జైలులో విచారణ ఖైదీగా ఉన్న నటుడు దర్శన్ (Darshan) కు కోర్టు నుంచి మరో బిగ్ షాక్ తగిలింది. దర్శన్ తరపు న్యాయవాదులు దాఖలు చేసిన రెండు పిటిషిన్లను 50వ సీసీహెచ్ కోర్టు మంగళవారం కొట్టివేసింది. అప్రూవర్ ప్రదోశ్ రావు(Pradosh Rao) కు పలు నిబంధనలు ఉండాలని, జైలు నుంచి కోర్టుకు వెళ్లే సమయంలో ఎవరితోనూ మాట్లాడకుండా కట్టడి చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. మరో పిటిషన్‌లో కోర్టులో విచారణ వేళ ప్రదోశ్ ముందు రోజు మర్చిపోయానంటూ మరుసటిరోజు ప్రస్తావించే అంశాలకు అవకాశం ఇవ్వరాదని పేర్కొన్నారు. అందుకు కోర్టు విచారణ జరిపి రెండు పిటిషన్లను కొట్టివేసింది.
కాగా అప్రూవర్‌గా మారిన ప్రదోశ్ సుమారు 108 పేజీల సుదీర్ఘ రహస్యాలను కోర్టు ముందు వివరించినట్టు సమాచారం. 175 పేరాలలో హత్యకు సంబంధించిన అంశాలు ఎవరెవరి భాగస్వామ్యం ఏమిటనే కోణంలో తెలిపినట్టు సమాచారం. కాగా ఇదే కేసులో జైలులో ఉన్న పవిత్రాగౌడ (Pavithra Gowda) విచారణ వేళ కంటతడి పెట్టారు. మంగళవారం విచారణవేళ న్యాయాధికారి ఎదుట పవిత్రాగౌడ పలు అంశాలను ప్రస్తావించారు. అందులో నైజీరియన్లు ఉండే బ్యారక్ నుంచి మార్పు చేయాలని కోర్టు ఆదేశించి నెలరోజులైనా అమలు చేయలేదని పవిత్రా గౌడ కంటతడి పెట్టారు. ఇదే విషయమై సమగ్ర నివేదిక ఇవ్వాలని న్యాయవాధికారి జైలు సూపరింటెండెంటును ఆదేశించారు.