ప్యాంటు విప్పించి.. దాడి చేశారు! రేణుకాస్వామి హత్య తీరును.. కోర్టుకు వివరించిన అప్రూవర్
ABN, Publish Date - Sep 30 , 2026 | 09:49 AM
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో అప్రూవర్‌గా మారిన ప్రదోష్ రావు అభిప్రాయాలను కోర్టు ఆలకించింది.
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసు (Renukaswamy Murder Case) లో అప్రూవర్‌గా మారిన ప్రదోష్ రావు (Pradosh Rao) అభిప్రాయాలను కోర్టు ఆలకించింది. 'నీ భార్యకు మెసేజ్ చేస్తే మౌనంగా ఉంటావా?' అంటూ నటుడు దర్శన్ (Darshan) తన సహచరుడు నాగరాజును దూషించి, రేణుకాస్వామిపై దాడి చేశారని వివరించారు. రేణుకాస్వామి హత్యకు సంబంధించిన అంశాలను సమగ్రంగా కోర్టు (59th City Civil and Sessions Court) )కు వివరించారు.
రేణుకాస్వామిపై దర్శన్ ఇష్టారాజ్యంగా దాడి చేశారని అన్నారు. ప్యాంటు విప్పించి మర్మాంగంపై తన్నారని, నేలపై ఉమ్మి దాన్ని నాకాలని సూచించారని అన్నారు. దాడి జరిగిన సమయంలో దర్శన్ ఎలా వ్యవహరించారనేది వివరించారు. సహచరుడు నాగరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేయగా దర్శన్ తీవ్రంగా కోప్పడ్డారని అన్నారు. ఆ తర్వాత రేణుక ముఖానికి పంచ్ కొట్టారని అన్నారు.