సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Salim Kumar: మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం.. ప్ర‌ముఖ న‌టుడు క‌న్నుమూత‌

ABN, Publish Date - Jun 07 , 2026 | 06:51 AM

మ‌ల‌యాళ సినీ ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు, నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌ స‌లీం కుమార్ (56) క‌న్నుమూశారు.

Salim Kumar

మ‌ల‌యాళ సినీ ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు, నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌ స‌లీం కుమార్ (Salim Kumar) (56) క‌న్నుమూశారు. శ‌నివారం రాత్రి ఉన్న‌ట్టుండి అనారోగ్య స‌మ‌స్య త‌లెత్త‌డంతో కుటుంబ స‌భ్యులు కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ రాత్రి 10.45 నిమిషాల‌కు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

మ‌ల‌యాళ నాట తిరుగులేని క‌మెడియ‌న్‌గా గుర్తింపు ఉన్న స‌లీం ఖాన్ చిన్న కెమియో రోల్‌తో 1991లో సినిమాల్లో అడుగుపెట్టి 2026 వ‌ర‌కు సుమారు వెయ్యి చిత్రాల వ‌ర‌కు న‌టించారు. మ‌మ్మ‌ట్టి, మోహ‌న్ లాల్ ఇలా అగ్ర స్టార్ల స‌ర‌స‌న అనేక చిత్రాల్లో క‌మెడియ‌న్‌గా విశేషంగా గుర్తింపు సంపాదించుకున్న స‌లీం కుమార్ ఆపై ద‌ర్వ‌కుడిగా మారి ఓ నాలుగు చిత్రాల‌ను సైతం డైరెక్ట్ చేశారు. వాటికి స్టేట్ ఆవార్డులు సైతం వ‌చ్చాయి. ఇదిలాఉంటే ఈ యేడు ఇప్ప‌టికే ఆయ‌న న‌టించిన ఆరు చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి.

స‌లీం కుమార్ విష‌యం తెల‌సుకున్న మ‌ల‌యాళ సినీ ప్ర‌ముఖులంతా ఆయ‌న‌ను చివ‌రిసారిగా చూసేందుకు ఆస్ప‌త్రికి త‌ర‌లి వెలుతుండ‌గా అభిమానులు క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు. సోష‌ల్ మీడియా ద్వారా శ్ర‌ద్ధాంజ‌లి గ‌టిస్తున్నారు. ఆయ‌న న‌టించిన సినిమాల‌ను, మ‌రుపురాని స‌న్నివేశాల‌ను గుర్తు చేసుకుంటున్నారు.

Updated Date - Jun 07 , 2026 | 06:51 AM