సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

విజయ్‌తో ప్రేమాయణం.. త్రిష సంచలన పోస్ట్!

ABN, Publish Date - Apr 06 , 2026 | 07:06 PM

త్రిష, కోలీవుడ్ దళపతి విజయ్.. ఈ ఇద్దరి పేర్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నాయి.

trisha krishnan

దశాబ్ద కాలంగా సౌత్ ఇండియాను ఏలుతున్న అందాల సుందరి త్రిష (trisha krishnan), కోలీవుడ్ దళపతి విజయ్ (thalapathy vijay).. ఈ ఇద్దరి పేర్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నాయి. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. చాలా మంది దృష్టిలో ఉన్న విషయమే ఏంటంటే, గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా, వీరి మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉండేది. అయితే ఇప్పుడు అది రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్‌కు మారిందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. విజయ్ తన వ్యక్తిగత జీవితంలో మార్పులు చేసుకోబోతున్నారని, త్రిషతో ఆయన ఏడడుగులు వేయబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న తరుణంలో విజయ్ తీసుకునే ప్రతి నిర్ణయం హాట్ టాపిక్ అవుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే త్రిష సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.

త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక వీడియో కోట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఇద్దరు వ్యక్తుల మధ్య ఆసక్తికర సంభాషణ సాగుతుంది. "ఇతరుల అభిప్రాయాలను, ఆలోచనలను మీరు ఎలా నియంత్రించగలరు? వారిని మీరు శాసించలేరు. మీరు చేయగలిగిందల్లా మీ జీవితాన్ని ఉత్తమంగా జీవించడమే." అంటూ సాగే ఆ వీడియో సారాంశం చూస్తుంటే.. తనపై వస్తున్న రూమర్లకు ఆమె పరోక్షంగా కౌంటర్ ఇచ్చిందా? అనే చర్చ మొదలైంది. ఆ వీడియోలో త్రిష మరో కీలక విషయాన్ని కూడా ప్రస్తావించారు. "ఒక మంచి వ్యక్తిగా ఉండండి. నిజాయితీతో జీవించండి, మాట్లాడండి. అప్పుడే ఇది మీ జీవితంలో అత్యుత్తమ రోజు అని తెలుసుకుని, రాత్రి హాయిగా నిద్రపోగలరు" అని పేర్కొన్నారు. అంటే తన చుట్టూ ఎన్ని వార్తలు వచ్చినా, తాను మాత్రం తన నిజాయితీని నమ్ముకుని ప్రశాంతంగా ఉన్నానని ఆమె చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తోంది. అలాగే ఈ పోస్ట్ ద్వారా తన వ్యక్తిగత విషయాల గురించి ఇతరులు చేసే కామెంట్లను తాను పట్టించుకోనని ఆమె స్పష్టం చేశారు.

ఒకవైపు ఈ రూమర్స్ ఇలా ఉంటే, మరోవైపు త్రిష తన కెరీర్ లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ ఇప్పటికీ స్టార్ హీరోలకు ఆమె ఫస్ట్ ఛాయిస్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' అనే భారీ సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో త్రిష పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని సమాచారం. షూటింగ్ సెట్స్‌లో ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటూ తన ప్రొఫెషనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. మరి త్రిష చేసిన ఈ పోస్ట్ కేవలం ఒక జనరల్ కోట్ మాత్రమేనా? లేక తన పెళ్లి వార్తలపై విమర్శలు చేస్తున్న వారికి ఇచ్చిన స్ట్రాంగ్ రిటార్టా? అనేది కాలమే నిర్ణయించాలి.

Updated Date - Apr 06 , 2026 | 07:30 PM