సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ధ‌నుష్‌తో రిలేష‌న్! మృణాల్ ఈ సారి ప‌క్కాగా దొరికిపోయిందిగా

ABN, Publish Date - Mar 27 , 2026 | 09:07 PM

ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మధ్య ఏదో నడుస్తోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

dhanush

తమిళ స్టార్ హీరో ధనుష్ (dhanush), బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (mrunal thakur) మధ్య ఏదో నడుస్తోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలపై మృణాల్ స్పందిస్తూ తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని, అంతకుమించి ఏమీ లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 'మా మధ్య డేటింగ్ వంటివి ఏమీ లేవు, ధనుష్ నాకు ఒక మంచి స్నేహితుడు మాత్రమే.. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు' అంటూ ఆమె ఈ రూమర్లను కొట్టి పారేశారు. సాధారణంగా ఇలాంటి గాసిప్స్ వచ్చినప్పుడు సెలబ్రిటీలు కాస్త జాగ్రత్తగా ఉంటారు, కానీ ఈ జోడీ మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ సాగుతోందన్న వార్తలు నిన్నమొన్నటివి కావు. వీరిద్దరూ కలిసి పలు పార్టీల్లో సందడి చేయడం, ముఖ్యంగా 'సన్నాఫ్ సర్దార్ 2' ప్రీమియర్స్ సమయంలో ధనుష్ ప్రత్యేకంగా హాజరై ఆమెతో సన్నిహితంగా మెలగడం వంటి పరిణామాలు ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అలాగే 'తేరీ ఇష్క్ మే' సినిమా విడుదల సమయంలో కూడా ఇటువంటి కథనాలు వెలువడ్డాయి. ఇక 'దో దీవానే సెహర్ మే' టీజర్‌పై ధనుష్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించడంతో, నెటిజన్లు వీరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందనే విషయాన్ని దాదాపు ఖరారు చేసేశారు.

ఒకానొక దశలో వీరిద్దరి మధ్య ఏమీ లేదని అభిమానులు సర్దుకుపోతున్న సమయంలో, తాజా పరిణామాలు మళ్ళీ చర్చకు దారితీశాయి. ప్రస్తుతం 'డెకాయిట్' హిందీ ప్రమోషన్లలో భాగంగా అడివి శేష్‌తో కలిసి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో మృణాల్ అనర్గళంగా తమిళంలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. మృణాల్ ఇప్పటి వరకు నేరుగా ఒక్క తమిళ సినిమా కూడా చేయలేదు, కనీసం ఏ ప్రాజెక్టుకు కమిట్ అయినట్లు అధికారిక సమాచారం కూడా లేదు. అలాంటిది ఆమె అంత స్పష్టంగా తమిళం మాట్లాడటం వెనుక ధనుష్ శిక్షణే ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మృణాల్ తరచూ చెన్నై పర్యటనలు చేయడం వెనుక కూడా ధనుష్ ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ వల్ల సినిమాలకు కావాల్సినంత ప్రీ-పబ్లిసిటీ, అటెన్షన్ లభిస్తున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ సక్సెస్ మాత్రం దక్కడం లేదు. మృణాల్ తమిళం నేర్చుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో, అలాగే ఈ తాజా గాసిప్స్‌పై ఆమె మళ్ళీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ వార్తలు కేవలం ప్రచారం కోసమేనా లేక నిజంగానే వీరి బంధం స్నేహానికి మించి ఉందా అనేది ఆసక్తికరంగా మారింది.

Updated Date - Mar 27 , 2026 | 09:43 PM