Ravi Mohan: నన్ను వేధిస్తున్నారు.. ఇకపై నేను నటించను
ABN, Publish Date - May 16 , 2026 | 02:15 PM
తమిళ నటుడు రవి మోహన్ (Ravi Mohan) తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని నెలలుగా వ్యక్తిగత జీవితం, భార్య ఆర్తితో విభేదాలు, గాయని కెనీషాతో సంబంధాలపై వస్తున్న వార్తల మధ్య ఆయన మీడియా ముందుకు రావడం ఆసక్తి రేపింది.
తమిళ నటుడు రవి మోహన్ (Ravi Mohan) తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని నెలలుగా వ్యక్తిగత జీవితం, భార్య ఆర్తితో విభేదాలు, గాయని కెనీషాతో సంబంధాలపై వస్తున్న వార్తల మధ్య ఆయన మీడియా ముందుకు రావడం ఆసక్తి రేపింది. తన భార్య ఆర్తి రవి నుండి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న రవి మోహన్, ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలలో చిక్కుకున్నాడు. ఈ విషయం కోర్టులో విచారణలో ఉండగా, గాయని కెనిషాతో కలిసి రవి మోహన్ పలు బహిరంగ కార్యక్రమాలలో కనిపించడం కొత్త చర్చకు దారితీసింది.
రవి మోహన్, కెనీషా కలిసి కార్యక్రమాలకు హాజరవుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత కెనీషా తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఆ విమర్శలు తట్టుకోలేక ఆమె రవి మోహన్‌తో సంబంధం తనను తీవ్రంగా బాధించిందని, ఈ సంఘటన నుండి బయటపడటానికి తాను రవి మోహన్ మరియు చెన్నైకి దూరంగా వెళ్ళిపోతున్నానని చెబుతూ ఒక సుదీర్ఘ ప్రకటనను కూడా విడుదల చేసింది. తాజాగా రవి మోహన్ సైతం ఒక ప్రెస్ మీట్ పెట్టి తన జీవితంలో జరుగుతున్న వాటి గురించి క్లారిటీ ఇచ్చాడు.
'నాకు విడాకులు వచ్చే వరకు నేను ఇకపై సినిమాల్లో నటించను. మనశ్శాంతి లేకపోవడం వల్ల నేను సినిమాలపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నాను. దీని కారణంగా నా సినిమాలు సరిగ్గా విడుదల కాని పరిస్థితి ఏర్పడింది. కొందరు నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. ఎక్కడి నుంచి ఎవరు దాడి చేసినా నేను ప్రశాంతంగా భరిస్తానని వారు అనుకుంటున్నారు. నేను ఇక మౌనంగా ఉండను. ఏమి జరుగుతుందో చూద్దాం. నా పని సమస్యలు మరియు వాటిని ఎలా పరిష్కరించాలి వంటి ఇతర విషయాలను నేను చూసుకుంటాను.
నేను మాట్లాడకపోవడం నా మూర్ఖత్వం అని నేను అనుకుంటున్నాను. నేను ఎప్పుడూ లొంగిపోతాను. కానీ సాధు బెదిరిస్తే లొంగడు. వాళ్ళు నాకు కోపం తెప్పించాలని చూస్తున్నారు. నేను వాళ్లకు ఒకటి చెబుతాను, నా ఆఫీసుకు వచ్చి నన్ను పంచ్ బ్యాగ్‌లా వాడుకోండి. పరోక్షంగా మాత్రం చేయకండి. నా సినిమా ఇకపై థియేటర్లలో విడుదల కాదు. నేను నటించలేను, నాపై జరిగిన అనవసర అవమానాలను నేను భరించలేను. నా వ్యక్తిగత జీవితం చక్కబడే వరకు, సైబర్‌బుల్లింగ్ ఆగిపోయే వరకు నేను నటించను. నా ఆఫీసుకు వచ్చి చూడండి. ఈ వేధింపులు తట్టుకోలేక నన్ను నేనే హర్ట్ చేసుకుంటున్నాను. నా చెయ్యి కోసుకున్నాను. ఇవన్నీ చక్కబడేవరకు నేను సినిమాలు చేయను' అని ఎమోషనల్ అయ్యాడు.