సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రజనీ ‘ధర్మన్‌’లో రామ్? రాశీ ఖన్నా చెప్పినట్టే చెప్పి.. 

ABN, Publish Date - Sep 29 , 2026 | 12:42 PM

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘జైలర్ 2’ విడుదలకు సిద్ధమవుతుండగా.. మరోవైపు ‘ధర్మన్’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘జైలర్ 2’ (Jailer 2) విడుదలకు సిద్ధమవుతుండగా.. మరోవైపు ‘ధర్మన్’ (Dharman) సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం మైసూరులో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ధర్మన్’లో టాలీవుడ్ హీరో రామ్ పోతినేని కూడా నటిస్తున్నారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న రాశీ ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు రుమార్లకు మరింత బలం చేకూర్చాయి. మైసూరు షూటింగ్ అనుభవాలను పంచుకున్న రాశీ.. రజనీకాంత్, రామ్‌లతో కలిసి ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. దీంతో ‘ధర్మన్’లో రామ్ భాగమయ్యారనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈ ఫోటోను పోస్ట్ చేసిన కాసేపటికే సోషల్ మీడియా అకౌంట్ నుంచి డిలీట్ చేశారు. ఈ విషయాన్నీ రాశిఖన్నా ఎందుకు గోప్యంగా ఉంచారనేది తెలియాల్సి ఉంది. 

ఈ సినిమాలో రాశీ ఖన్నా రజనీకాంత్ కుమార్తె పాత్రలో కనిపించనున్నట్లు  టాక్ నడుస్తోంది. అలాగే రామ్‌కు సంబంధించిన పాత్రపై కూడా పలు కథనాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఆయన పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఉంటాయనే సమాచారం కూడా వినిపిస్తున్నప్పటికీ.. దీనిపైనా మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ‘డ్రాగన్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్ వంటి సీనియర్ స్టార్‌తో ఆయన చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై  అంచనాలు నెలకొన్నాయి. వచ్చే సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  

Updated Date - Sep 29 , 2026 | 01:20 PM