సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rajinikanth: సూపర్‌స్టార్‌ అభిమానులకు డబుల్‌ ట్రీట్‌..

ABN, Publish Date - Nov 20 , 2026 | 06:34 PM

‘జైలర్‌ 2’ విజయంతో మంచి జోష్‌లో ఉన్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

‘జైలర్‌ 2’ విజయంతో మంచి జోష్‌లో ఉన్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో ఆయన ‘ధర్మన్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రజనీతో పాటు రామ్‌ పోతినేని, నయనతార, శ్రీలీల, రాశీ ఖన్నా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్‌హాసన్‌, ఆర్‌. మహేంద్రన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ రానున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు రెండో వారంలో చిత్ర టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, టీజర్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రజనీ అభిమానులు ఈ అప్‌డేట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఇప్పటికే మూడు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ వచ్చే వారం నుంచి చెన్నైలో ప్రారంభం కానుంది. ఇందుకోసం చిత్రబృందం ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తోందట. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్‌ అంశాలను మేళవించిన ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. ఇందులో రజనీకాంత్‌ డాక్టర్‌ పాత్రలో కనిపించనుండగా, ఆయన అల్లుడి పాత్రలో రామ్‌ పోతినేని సందడి చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు టాక్‌. అనిరుధ్‌ సంగీతం అందిస్తుండగా, నికేత్‌ బొమ్మి ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Updated Date - Nov 20 , 2026 | 07:35 PM