రజనీకాంత్.. కమల్‌హాసన్.. మల్టీస్టారర్ సర్వం సిద్ధం
ABN, Publish Date - Feb 08 , 2026 | 11:21 AM
కోలీవుడ్ స్టార్స్ రజనీకాంత్(Rajinikanth), కమల్‌హాసన్ (Kamal Haasan) కలిసి నటించే సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
కోలీవుడ్ స్టార్స్ రజనీకాంత్(Rajinikanth), కమల్‌హాసన్ (Kamal Haasan) కలిసి నటించే సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilip kumar) దర్శకత్వం వహించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ‘విత్ లవ్’ సినిమా ప్రచార వేదికపై రజనీకాంత్ కూతురు సౌందర్య ఈ సినిమా గురించి మాట్లాడారు. ‘నాన్న, కమల్‌హాసన్‌గారి కాంబోలో సినిమా కోసం నేను కూడా ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నా. ఈ సినిమా కోసం లోకేశ్ కనకరాజు కూడా మాట్లాడారు. అయితే కథగా ఇంకా ఏమీ చెప్పలేదు’ అని అన్నారు. దీనిని బట్టి చూస్తే ఈ సినిమాకు దర్శకులుగా నెల్సన్ దిలీప్, లోకేశ్ కనకరాజు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ మల్టీస్టారర్ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కోలీవుడ్ మీడియా మాత్రం నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని చెబుతోంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర వార నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన ప్రోమో మేకింగ్ చెన్నైలో మొదలైందని తెలిసింది. దీనికోసం ప్రత్యేక సెట్‌ను తీర్చిదిద్దారని తెలిసింది. త్వరలోనే ఈ ప్రచార చిత్రంతోనే ఈ సినిమాను ప్రకటించనున్నారట. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మించే అవకాశముంది.