సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్‌పై బిగ్ అప్‌డేట్.. షూటింగ్ ఎప్పటినుంచంటే?

ABN, Publish Date - Oct 23 , 2026 | 11:50 AM

రజనీకాంత్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించనున్న మల్టీస్టారర్ షూటింగ్ నవంబర్‌లో ప్రారంభం కానుందనే ప్రచారం వైరల్ అవుతోంది.

Rajinikanth, Kamal Haasan

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth), లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) కలయికలో ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పుడు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ప్రకటన తర్వాత ఎలాంటి అప్‌డేట్స్ రాకపోవడంతో సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమా చిత్రీకరణను నవంబర్ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అలాగే, కమల్ హాసన్ డిసెంబర్ నుంచి షూటింగ్‌లో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. అయితే, చిత్రబృందం నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రెడ్ జైంట్ పిక్చర్స్ (Red Giant Pictures) నిర్మించనున్న ఈ మల్టీస్టారర్ అనౌన్స్‌మెంట్ వీడియో ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. ఇద్దరు దిగ్గజ నటులు ఒకే సినిమాలో కనిపించనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగాయి. తాజా ప్రచారమే నిజమైతే, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. రజనీకాంత్, కమల్ హాసన్‌లను ఒకే తెరపై చూసేందుకు ఎదురుచూస్తున్న అభిమానులకు అధికారిక అప్‌డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Updated Date - Oct 23 , 2026 | 11:58 AM