సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rajinikanth: జైలర్ 2 కలెక్షన్ల విధ్వంసం.. ఏ రాష్ట్రంలో ఎంత వసూళ్లు వచ్చాయంటే?

ABN, Publish Date - Nov 02 , 2026 | 06:25 PM

రజనీకాంత్ జైలర్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, కేరళ, కర్ణాటక, ఓవర్సీస్‌లో ఏ మేర కలెక్షన్లు వచ్చాయో తెలుసుకుందాం.

jailer 2

కోలీవుడ్‌ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించాలన్నా.. వాటిని తిరగరాయాలన్నా అది ఒక్క రజనీకాంత్ (Rajinikanth) కే సాధ్యం. రీసెంట్‌గా నెల్స‌న్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) ద‌ర్శ‌క‌త్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మోస్ట్ అవేటెడ్ మూవీ జైలర్-2 (Jailer 2) థియేటర్లలో ఓ రేంజ్‌లో విధ్వంసం సృష్టిస్తుంది. విడుదలైన మొదటి రోజు నుంచే వసూళ్ల సునామీ మొదలైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లకు పైగా గ్రాస్ సాధించి, 800 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. కోలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన నంబర్ వన్ చిత్రంగా నిలిచిన 2.0 లైఫ్‌టైమ్ రికార్డులను దాటేసి జైలర్-2 ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ పీఠాన్ని అధిరోహించే దిశగా దూసుకెళ్తోంది. ఏయే రాష్ట్రాల్లో జైలర్‌-2 ఎంత మేర కలెక్ట్‌ చేసిందంటే..?

మొదటగా తమిళనాడు మార్కెట్ విషయానికి వస్తే.. రజనీకాంత్ తన సొంత అడ్డాలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. తమిళ వెర్షన్ ఒక్కటే దేశీయంగా దాదాపు 300 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించి సరికొత్త మైలురాయిని చేరుకుంది. చెన్నై సిటీతో పాటు తమిళనాడులోని ప్రతి ప్రధాన సర్కిల్‌లోనూ హౌస్‌ఫుల్ బోర్డులతో జైలర్-2 థియేటర్లు కళకళలాడాయి. ఇక కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనూ రజనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కర్ణాటకలో శివ రాజ్‌కుమార్ ఇంపాక్ట్, లోకల్ ఫ్యాన్ బేస్ కలసి 87 కోట్లకు పైగా కలెక్షన్లను అందించగా, కేరళలో సైతం మోహన్‌లాల్ క్యామియోతో పాటు ఉన్న క్రేజ్ వల్ల సినిమా 72 కోట్ల రూపాయల రికార్డు స్థాయి వసూళ్లను సొంతం చేసుకుంది.


ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రజనీకాంత్ మార్కెట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి భాగం జైలర్ బ్లాక్‌బస్టర్ కావడంతో, తెలుగులో జైలర్-2 మీద భారీ హైప్ నెలకొంది. అందుకు తగ్గట్టే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని దాదాపు 100 కోట్లకు చేరువులో నెట్ వసూళ్లు నమోదు కావడం విశేషం. డబ్బింగ్ సినిమాల్లో అత్యధిక షేర్ సాధించిన చిత్రాల్లో జైలర్‌-2 ఒకటిగా నిలిచి తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.అయితే నార్త్ ఇండియా మార్కెట్‌లో మాత్రం జైలర్-2 హిందీ వెర్షన్ దాదాపు 45 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేయడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురి చేసింది. ఓ తమిళ సీక్వెల్ సినిమా హిందీ బెల్ట్‌లో ఇంతటి బలమైన వసూళ్లు రాబట్టడం రజనీకాంత్‌కు దేశవ్యాప్తంగా ఉన్న తిరుగులేని పాపులారిటీకి నిదర్శనం.


దేశీయ మార్కెట్ మాత్రమే కాదు.. ఓవర్‌సీస్‌లోనూ జైలర్-2 అరాచకం సృష్టించింది. విదేశీ మార్కెట్ల నుంచి ఏకంగా 270 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వెల్లువెత్తాయి. నార్త్ అమెరికా, యూకే, గల్ఫ్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో ఇండియన్ సినిమాల మునుపటి రికార్డులను తిరగరాసింది. ఓవర్సీస్‌లో అంతర్జాతీయ స్థాయి ఓపెనింగ్స్ సాధించడంలో రజనీకాంత్‌కు సాటిఎవరూ లేరని ఈ కలెక్షన్ల ప్రవాహం నిరూపించింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మొత్తం వసూళ్లలో దాదాపు 35 శాతానికి పైగా గ్రాస్ ఒక్క ఓవర్‌సీస్ నుంచే రావడం సాధారణ విషయం కాదు. సినీ ప్రస్థానంలో ఎందరో స్టార్స్ వస్తుంటారు.. పోతుంటారు. కానీ బాక్సాఫీస్‌ను శాసిస్తున్న ఏకైక రారాజు రజనీకాంత్. వయసు కేవలం నంబర్ మాత్రమేనని, కంటెంట్‌తో పాటు సరైన ఎలివేషన్ పడితే బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుందని జైలర్-2 తో మరోసారి స్పష్టమైంది.

Updated Date - Nov 02 , 2026 | 06:27 PM