ఐమ్యాక్స్ ఫార్మెట్‌లో..‘జైలర్-2’
ABN, Publish Date - May 26 , 2026 | 12:53 PM
సూపర్‌స్టార్ Rajinikanth హీరోగా, దర్శకుడు Nelson Dilipkumar తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ Jailer 2 గురించి ఆసక్తికర సమాచారం బయటకొచ్చింది.
నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన ‘జైలర్-2’ (Jailer 2) మూవీలోని పలు సన్నివేశాలను ఐమ్యాక్స్ ఫార్మెట్‌లోనే చిత్రీకరించినట్టు సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాణ పనులను జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి వచ్చే ప్రతి అప్‌డేట్ ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేపుతోంది. సాధారణంగా ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఐమ్యాక్స్ ఫార్మెట్‌లోకి మారుస్తారు. కానీ, ‘జైలర్-2’ మూవీ మాత్రం చిత్రీకరణ దశలోనే పలు కీలక సన్నివేశాలను ఐమ్యాక్స్ ఫార్మెట్‌లో అత్యాధునిక సాంకేతిక పరిఙ్ఞానంతో చిత్రీకరించారు.
సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రంలో రజనీకాంత్, రమ్యకృష్ణ, మిర్ణా, శివరాజ్ కుమార్, మోహన్‌లాల్ తదితరులు నటించారు. గతంలో విడుదలైన ఈ సినిమా తొలిభాగం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెల్సిందే. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత కళానిధి మారన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.