సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'బాషా' నిర్మాత కన్నుమూత

ABN, Publish Date - Feb 16 , 2026 | 10:32 AM

రజనీకాంత్ హీరోగా నటించిన బాషా చిత్ర నిర్మాత, దర్శకుడు వి. తమిళగన్ (70) మృతి చెందారు.

Baashha

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన బాషా (Baashha) చిత్ర నిర్మాత, దర్శకుడు వి. తమిళగన్ (70) (V. Thamilazhagan) మృతి చెందారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, వయోభారంతో బాధపడుతున్న ఆయన టి. నగర్, తిరుమలై పిళ్ళై రోడ్డులోని నివాసంలో శనివారం తుదిశ్వాస విడి చినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

తమిళ చిత్రపరిశ్రమలో సూపర్ హిట్ చిత్రాల నిర్మాతగా గుర్తింపు పొందిన ఆయన.. 'బాషా', 'రాణువ వీరన్', 'పణక్కారన్', 'మూండ్రు ముగం', 'కాకిచట్టై, 'పదియవాసం' వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అలాగే, 'మందిరపున్నగై', 'నిలాపెళ్లే' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి.

కాగా, తమిళ్ ఆళగన్ మృతిపట్ల రజనీకాంత్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఒక మంచి మానవతావాదిని కోల్పోయినట్లు పేర్కొన్నారు. అలాగే, తమిళ సినీ నిర్మాతల మండలితో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపట్ల తమ సంతాపం ప్రకటించారు.

Updated Date - Feb 16 , 2026 | 10:54 AM