సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

యాక్ష‌న్ మోడ్‌లో రాజ్ త‌రుణ్‌.. గాడ్స్ అండ్ సోల్జర్స్ ట్రైజ‌ర్ వ‌చ్చేసింది!

ABN, Publish Date - Apr 13 , 2026 | 10:30 AM

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న కొత్త‌ చిత్రం 'గాడ్స్ అండ్ సోల్జర్స్ .

'గోలీసోడా', గోలీసోడా - 2' చిత్రాల దర్శకుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ (Vijay Milton) దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న కొత్త‌ చిత్రం 'గాడ్స్ అండ్ సోల్జర్స్ (Gods and Soldiers). రఫ్ నోట్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో నిర్మిస్తోంది. ఈ సినిమాతో రాజ్‌ తరుణ్‌ (Raj Tharun) కథానాయకుడు కాగా ఫ‌స్ట్ టైం త‌మిళంలోను ఎంట్రీ ఇస్తున్నాడు. భరత్‌, ఆరి అర్జునన్, సునీల్‌, వేదన్‌, అమ్ము అభిరామి, కిషోర్‌, జెఫ్రీరి, భరత్‌ శ్రీని, పాల డబ్బా, విజిత ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు రెడీ అయింది. ఈ నేప‌థ్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ట్రైజర్‌ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. దీనిని ప్రముఖ సంచలన దర్శకుడు హరీష్‌ శంకర్‌ తన సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా రిలీజ్ చేశారు.

కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీక్వెన్ల‌తో పాటు హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు ఉన్నట్లు ట్రెజర్‌ను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి, త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ తెలిపారు. ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని ఇచ్చే చిత్రమి దని విజయ్ మిల్టన్ చెప్పారు.

Updated Date - Apr 13 , 2026 | 10:45 AM