పృథ్వీరాజ్ సుకుమార‌న్.. ఐ నోబ‌డీ ట్రైల‌ర్‌! ల‌క్కీ భాస్క‌ర్‌ను.. మించి ఉందిగా

ABN , Publish Date - Jun 18 , 2026 | 07:49 PM

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా మ‌ల‌యాళంలో కొత్త‌గా రూపొందిన హైస్ట్‌ థ్రిల్ల‌ర్ చిత్రం ఐ నోబ‌డీ.

Prithviraj Sukumaran

స‌లార్ ఫేం పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా మ‌ల‌యాళంలో కొత్త‌గా రూపొందిన హైస్ట్‌ థ్రిల్ల‌ర్ చిత్రం ఐ నోబ‌డీ (I,Nobody). నిష‌మ్ బ‌షీర్ (Nisam Basheer) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా పార్వతి తిరుమోతు (Parvathy Thiruvothu), హ‌క్కీం షాజ‌హాన్‌, అశోక‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 9న పాన్ ఇండియా స్థాయిలో మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల‌లో విడుద‌ల కానుంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా గురువారం సాయంత్రం ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్‌ను చూస్తుంటే రెండేండ్ల క్రితం తెలుగులో దుల్క‌ర్ హీరోగా వ‌చ్చిన ల‌క్కీ భాస్క‌ర్ త‌ర‌హా క‌థ‌తో ఈ చిత్రం రూపొందించిన‌ట్లు తెలుస్తోంది. బ్యాంకుల‌లో ఉండే లొసుగుల‌ను అధారంగా చేసుకుని ఓ వ్య‌క్తి త‌న తెలివితో చేసే దోపిడీలు, అత‌నిని ప‌ట్టుకునేందుకు పోలీసులు, ఇత‌ర వ్యవ‌స్థ‌లు చేసే ప‌నుల చుట్టూ ఈ మూవీ తిర‌గ‌నున్నది అర్థ‌మ‌వుతుంది. ట్రైల‌ర్ మాత్రం ఓ సీరియ‌స్ థ్రిల్ల‌ర్ ఫిల్మ్‌ను చూడ‌బోతున్నాం అనేలా ప్రామిసింగ్‌గా ఉంది. ఇంకెందుకు ఆల‌స్యం ఇప్పుడే మీరు కూడా ఐ నోబ‌డీ ట్రైల‌ర్ చూసేయండి.

Updated Date - Jun 18 , 2026 | 07:56 PM