సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బెంగళూరులో ‘పోలీస్ కంప్లైంట్’ టీజర్ విడుదల

ABN, Publish Date - Mar 17 , 2026 | 04:28 PM

నవీన్ చంద్ర, వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన 'పోలీస్ కంప్లైంట్' కన్నడ వర్షన్ టీజర్ బెంగళూరులో విడుదలైంది. ప్రేమ, పూజాగాంధీ తదితరులు ఈ వేడుకలో పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Police complaint Movie

నవీన్ చంద్ర (Naveen Chandra), వరలక్ష్మీ శరత్‌ కుమార్ (Varalakshmi Sharathkumar) ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'పోలీస్‌ కంప్లైంట్‌'. సంజీవ్ మేగోటి (Sanjeev Megoti) దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా ఈ చిత్రాన్ని నిర్మించారు. రాగిణి ద్వివేది, కృష్ణసాయి ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కన్నడ వర్షన్ టీజర్‌ను బెంగళూరులో సినీ ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు. ఈ వేడుకలో ప్రముఖ కన్నడ నటి ప్రేమ, 'దండుపాళ్యం' ఫేమ్ పూజా గాంధీ, కన్నడ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్.ఆర్.కె. విశ్వనాథ్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు సంజీవ్ మేగోటి పదేళ్ళ తర్వాత మళ్ళీ మంచి కథతో కన్నడ ఇండస్ట్రీలోకి రావడం ఆనందంగా ఉందని విశ్వనాథ్‌ అన్నారు. నటి ప్రేమ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా కథ ఎంతో ఆసక్తికరంగా ఉందని, తక్కువ సమయంలో క్వాలిటీతో ఈ సినిమాను నిర్మించారని నటి రాగిణి ద్వివేది కితాబిచ్చారు. నవీన్ చంద్ర, వరలక్ష్మీ శరత్ కుమార్ వంటి ప్రతిభావంతులతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు.


దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడూతూ, కేవలం 45 రోజుల్లో 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో ఈ సినిమాను తెరకెక్కించడం ఒక ప్రత్యేక అనుభవమని తెలిపారు. ‘పోలీస్ కంప్లైంట్’ పూర్తి స్థాయి సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిందని, ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ సినిమాను విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు. మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, విడుదలైన ఈ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది.

Updated Date - Mar 17 , 2026 | 04:28 PM