మూడు పెళ్లిళ్లు.. దర్శకుడిపై చెప్పులతో కుటుంబ సభ్యుల దాడి
ABN, Publish Date - Oct 13 , 2026 | 07:40 PM
ప్రముఖ శాండల్‌వుడ్ దర్శకుడు నవీన్ శక్తిపై అతని కుటుంబ సభ్యులు దాడి చేశారు.
ప్రముఖ శాండల్‌వుడ్ (Sandalwood) దర్శకుడు నవీన్ శక్తి (Naveen Shakthi ) పై అతని కుటుంబ సభ్యులు దాడి చేశారు. తన దర్శకత్వంలో రూపొందుతున్న విక్రం వేదాంత్ (Vikram Vedanth) సినిమా ముహూర్త కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతుండగా సోమవారం ఈ దాడి జరిగింది. మాగడి రోడ్డులోని జైన్ దేవాలయంలో ముహూర్తం షాట్ చిత్రీకరించారు. గుబ్బి వీరణ్ణ మనవడు శివప్రదీప్ ఈ సినిమాలో నటిస్తున్నారు.
మహూర్తం షాట్ ముగియగానే డైరెక్టర్ నవీన్ శెట్టి మీడియాతో మాట్లాడుతుండగా ఆయన భార్య, కుమారుడు, కూతురు వచ్చి చెప్పులతో దాడి చేశారు. అంతేగాక ఈ సినిమా కథ రాసిన భారతి అనే మహిళపైనా దాడి జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. భార్య, కుమారుడు వారిపై చెప్పులతో దాడిచేసినట్లు సమాచారం. నవీన్ శెట్టి కుటుంబంలో కలహాలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంతకుముందు క్యాలెండర్ సినిమాకు దర్శకత్వం వహించారు.