Demonte Colony 3: డిమాంటే కాలనీ3.. ఫస్ట్ లుక్ అదిరింది
ABN, Publish Date - Jan 01 , 2026 | 04:18 PM
ప్రేక్షకులను విశేషంగా భయ పెట్టి ఓ రేంజ్‌లో థ్రిల్ అందించిన సూపర్ నాచురల్ హర్రర్ థ్రిల్లర్ చిత్రం డీమాంటే కాలనీ .
ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చి ప్రేక్షకులను విశేషంగా భయ పెట్టి ఓ రేంజ్‌లో థ్రిల్ అందించిన సూపర్ నాచురల్ హర్రర్ థ్రిల్లర్ చిత్రం డీమాంటే కాలనీ (Demonte Colony). ఈ సిరీస్‌లో తొలి సినిమా 2015లో ఓ చిన్న చిత్రంగా వచ్చి అంచనాలను మిచి విజయాన్ని సాధించింది. తర్వాత ఆ తర్వాత తొమ్మిదేండ్లకు రెండో భాగం వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
అయితే.. ఇప్పుడు ఈ సినిమా మూడవ చివరి భాగం డిమాంటే కాలనీ ది ఎండ్ టూ పార్ అవే (Demonte Colony 3: The End Is Too Far Away) విదేశాల్లో షూటింగ్ వేగంగా జరుపుకుంటుంది. గత పార్ట్‌లో ఉన్న అరుళ్ నిధి (Arulnithi), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar), అరుణ్ పాండ్యన్. మీనాక్షి గోవిందరాజన్ ఇందులోనూ కంటిన్యూ అవుతుండగా కొత్తగా మలయాళ నటి మియా జార్జ్, అర్చనా రవి చంద్రన్ ఈ సినిమాలో భాగం అయ్యారు.
గత రెండు చిత్రాలను మించి రెటట్ఇంపు బడ్జెట్‌తో. అంతతకుమించిన అంతర్జాతీయ టెక్నీషియన్లతో విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. అయితే.. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం, జనవరి 1న రిలీజ్ చేసిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ స్టన్నింగ్‌గా ఉంది. హీరో పూర్తిగా దయ్యంగా మారి డిమాంటే రాయల్ ఛైర్‌లో కూర్చోని తదేకంగా చూస్తూ ఉన్న ఫొటో భయపెట్టేలా ఉంది. మాస్టర్‌మైండ్ అజయ్ జ్ఞానముత్తు ఈ మూవీకి సైతం దర్శకత్వం వహిస్తుండగా శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టులో థియేటర్లకు రానుంది.