సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కోలీవుడ్‌ దర్శక సంఘం నూతన కార్యవర్గం

ABN, Publish Date - Feb 17 , 2026 | 11:22 AM

తమిళ సినీ దర్శకుల సంఘానికి (కోలీవుడ్‌ దర్శకుల సంఘం) తాజాగా జరిగిన ఎన్నికల్లో కొత్త కార్యవర్గ సభ్యులు ఎంపికయ్యారు.  వీరి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం  జరిగింది 

తమిళ సినీ దర్శకుల సంఘానికి తాజాగా జరిగిన ఎన్నికల్లో కొత్త కార్యవర్గ సభ్యులు ఎంపిక కాగా, ఈ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం వడపళనిలోని మ్యూజిషియన్‌ యూనియన్‌ హాలులో జరిగింది.

ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఆర్‌కే సెల్వమణి, ప్రధాన కార్యదర్శిగా ఆర్వీ ఉదయకుమార్‌, కోశాధికారిగా పేరరసు, ఉపాధ్యక్షులుగా పి.వాసు, కేఎస్‌ రవికుమార్‌, సహాయ కార్యదర్శులుగా ఎస్‌.ఎళిల్‌, చరణ్‌, సుందర్‌.సి, ఎన్‌.ఏకాంబవాణన్‌, ఏకే నంబిరాజన్‌, కార్యవర్గ సభ్యులుగా ఆర్‌.అరవింద్‌ రాజ్‌, ఎన్‌.లింగుస్వామి, మాదేష్‌, మనోజ్‌కుమార్‌, ఏఆర్‌.మురుగదాస్‌, ఎస్‌.రవిమరియా, శరవణ సుబ్బయ్య, ఏ.వెంకటేష్‌, వెంకట్‌ప్రభు, అశోక్‌ అన్నామలై, ఇందిరా క్లారా, ఆర్‌కే కన్నన్‌, ముత్తువడుగు, టి.రమేష్‌ ప్రభాకరన్‌, సాయిరాంకీ, సుబ్రహ్మణ్య భారతి ఉన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 02:03 PM