విజయ్ మామూలోడు కాదబ్బా .. త్రిష పేరుతోనే పార్టీ
ABN, Publish Date - Mar 02 , 2026 | 05:22 PM
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) విడాకుల వివాదం మరింత ముదురుతోంది. నటితో విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తూ భార్య సంగీత కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే. ఆ నటి త్రిష కృష్ణన్ (Trisha Krishnan) అని నెటిజన్స్ అంటున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) విడాకుల వివాదం మరింత ముదురుతోంది. నటితో విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తూ భార్య సంగీత కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే. ఆ నటి త్రిష కృష్ణన్ (Trisha Krishnan) అని నెటిజన్స్ అంటున్నారు. గత కొన్నేళ్లుగా విజయ్ - త్రిష రిలేషన్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తూనే వస్తున్నాయి. త్రిష సైతం విజయ్ తో క్లోజ్ గా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఆ వార్తలకు ఆజ్యం పోశారు. ఎప్పటి నుంచో త్రిష రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారని, విజయ్ ప్రస్తుతం రాజకీయంగా ఎదుగుతుండడంతో ఆమె.. ఆయనతో సన్నిహితంగా ఉంటున్నారని కొందరు చెప్పుకొచ్చారు. కానీ, వాటిని త్రిష ఖండించారు. విజయ్ కేవలం తనకు మంచి స్నేహితుడు అని తెలిపారు. దీంతో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.
ఇక ఇప్పుడు విజయ్ భార్య సంగీత సైతం తన భర్తకు నటితో ఎఫైర్ ఉంది అని చెప్పడంతో ఖచ్చితంగా త్రిషనే అని నెటిజన్స్ కన్ఫర్మ్ చేశారు. గతంలో విజయ్ - త్రిష కలిసి ఉన్న ఫోటోలను వెతికి మరీ బయటకు తీస్తున్నారు.అక్కడితో ఆగకుండా కొందరు విజయ్ రాజకీయ పార్టీకి ఏకంగా త్రిష పేరునే పెట్టారని చెప్పుకొస్తున్నారు. విజయ్ పార్టీ పేరు TVK( తమిళగ వెట్రి కజగం) ఈ పేరును స్వయంగా విజయే ప్రకటించారు. అయితే విజయ్ పెట్టిన పార్టీ పేరులో త్రిష పేరు కూడా ఉందని, కావాలనే త్రిష పేరు కలిసొచ్చేలా పార్టీ పేరు పెట్టినట్లు మాట్లాడుకుంటున్నారు. త్రిష పూర్తి పేరు త్రిష కృష్ణన్. ఆ పేరు మధ్యలో విజయ్ ని యాడ్ చేసి త్రిష విజయ్ కృష్ణన్.. షార్ట్ కట్ లో టీవీకే. ఇదే పేరును పార్టీ పేరుగా పెట్టినట్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది విన్న చాలామంది నెటిజన్స్ అవునా.. విజయ్ మామూలోడు కాదబ్బా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంకోపక్క విజయ్ అభిమానులు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు. ఇదంతా ప్రత్యర్థులు చేస్తున్న కుట్ర అని, విజయ్ ఎప్పటికీ అలా చేయరని చెప్తున్నారు. విజయ్ పార్టీ పేరు తమిళగ వెట్రి కజగం అని, టీవీకేకి మరో అర్ధం లేదని వాదిస్తున్నారు. ఈ ఆరోపణలన్నీ కేవలం విజయ్ ని వ్యక్తిగతంగా కృంగదీయడానికి మాత్రమే చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటివరకు విజయ్ తన విడాకుల వివాదంపై స్పందించలేదు. మరి దీనిపై ఆయన ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.