సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నయన్ కి ఇది పెద్ద అవమానమే..

ABN, Publish Date - Nov 09 , 2026 | 09:05 PM

ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara)కి ఏ రేంజ్ ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు సమానంగా అమ్మడి సినిమాలు రికార్డులు సృష్టిస్తాయి.

Mookuthi Amman 2

ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara)కి ఏ రేంజ్ ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు సమానంగా అమ్మడి సినిమాలు రికార్డులు సృష్టిస్తాయి. అందుకే నిర్మాతలు.. నయన్ కోసం ఎంతైనా ఖర్చుపెట్టడానికి వెనుకాడరు అనేది నమ్మదగ్గ నిజం. కానీ, ఈ మధ్యకాలంలో నయన్ మార్కెట్ అంతగా బాలేదు అనేది కూడా వాస్తవమే. తెలుగులో మన శంకరవరప్రసాద్ గారు సినిమా తప్ప ఆమె నటించిన, నిర్మించిన సినిమాలు అన్ని పరాజయాన్ని అందుకున్నవే. ఇక ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం డివోషనల్ డ్రామా ‘మూకుతి అమ్మన్ 2’ , తెలుగులో 'మహాశక్తి' పేరుతో దీపావళి పండగ కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.


కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదలై అమ్మోరు తల్లి పేరుతో తెలుగు, తమిళంలో సూపర్‌హిట్ సాధించిన మూకుతి అమ్మన్ కు సీక్వెల్‌ అని ప్రకటించారు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆర్‌జే బాలాజీ సీక్వెల్ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలోకి సుందర్ సి వచ్చాడు. ఆ తరువాత పేరుని కూడా మహాశక్తిగా మారచ్చసి.. అమ్మోరు తల్లికి సీక్వెల్ కాదని తేల్చిచెప్పారు. ఇక నయనతార స్వయంగా పలు దేవాలయాలను దర్శించుకుని మహిళలకు చీరలు పంచిపెట్టడం వంటి భారీ ప్రమోషన్లు చేసి ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమాని రిలీజ్ చేశారు. అయితే ఎన్ని చేసినా కథలో బలం లేకపోవడంతో ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను ఆదరించలేదు. ఫస్ట్ వీకెండ్ పూర్తయినా కనీసం పది కోట్ల కలెక్షన్ కూడా రాకపోవడంతో బయ్యర్లు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు.


ఈ సినిమాలో నయన్ మహాశక్తి, పోలీస్ కానిస్టేబుల్ గా డ్యూయల్ రోల్ చేసినప్పటికీ, ఏమాత్రం వర్కవుట్ అవ్వలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని విచ్చలవిడిగా వాడేసి, దాన్నే విఎఫ్ఎక్స్ (VFX) అనుకోమంటే జనం నమ్మే పరిస్థితిలో లేరని ప్రేక్షకులు రుజువు చేశారు. కంటెంట్ కొత్తగా లేకపోవడం, పాతికేళ్ల నాటి రొటీన్ మాస్-డివోషనల్ ఫార్ములాను సుందర్ సి మళ్లీ నమ్ముకోవడంతో స్వయంగా నయనతార ఫ్యాన్సే ఇదేం సినిమా బాబోయ్ అంటూ థియేటర్ల నుంచి బయటకు వస్తున్నారు. అసలు మరీ దారుణంగా నయన్ సినిమాకి కేవలం రూ. 10 కోట్లు కలక్షన్స్ రావడం అనేది ఘోర అవమానమని చెప్పుకొస్తున్నారు.


రామాయణ, సీన్ వంటి సినిమాలకు హౌస్‌ఫుల్ బోర్డులు పడి ఓవర్ ఫ్లోస్ వచ్చినా, మిగిలిన జనం కూడా మహాశక్తి వైపు చూడకపోవడం నయనతార స్టార్ డమ్‌పై గట్టి దెబ్బేనని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సౌత్‌లోనే భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న లేడీ సూపర్ స్టార్ నయన్‌కు ఇది ముమ్మాటికీ అవమానకర ఫలితమేనని అంటున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కి వచ్చాక ఓటీటీలో ట్రోలింగ్ ఏ స్థాయిలో ఉంటుందో అని నయన్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Nov 09 , 2026 | 09:07 PM