సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Suriya 49: సూర్యకు నాగార్జున.. విలన్‌గా కాబోతున్నారా? 

ABN, Publish Date - Aug 30 , 2026 | 09:18 AM

తమిళ స్టార్‌ హీరో సూర్య, దర్శకుడు హెచ్‌. వినోద్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. 

తమిళ స్టార్‌ హీరో సూర్య, దర్శకుడు హెచ్‌. వినోద్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంపై ఆసక్తికరమైన అప్‌డేట్‌ వైరల్‌ అవుతోంది. ‘సూర్య 49 వర్కింగ్ టైటిల్ తో  ఝగరం స్టూడియోస్ సంస్థ నిర్మించనుంది. భారీ స్థాయిలో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్‌ నటి వామికా గబ్బిని తీసుకునేందుకు మేకర్స్‌ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను  సంప్రదించినట్లు తెల్సింది. ఇదే కాకుండా మరో వార్త కూడా వైరల్ అవుతోంది. 

అక్కినేని నాగార్జునను ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాగార్జున పాత్ర సినిమాకు చాలా  కీలకం అని  టాక్‌ నడుస్తోంది. అయితే దీనిపై ఇప్పటిదాకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఆయన ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. హెచ్‌. వినోద్‌ తనదైన యాక్షన్‌ ట్రీట్‌మెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.  2027 ప్రారంభంలో ఈ సినిమా మొదలయ్యే అవకాశముంది.  

Updated Date - Aug 30 , 2026 | 09:26 AM