ఎస్కే చిత్రానికి.. సాయి అభ్యంకర్ సంగీతం
ABN, Publish Date - Oct 14 , 2026 | 06:58 AM
శివకార్తికేయన్ హీరోగా రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న SK27 సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నారు.
రామ్ కుమార్ బాలకృష్ణన్ (Ramkumar Balakrishnan) దర్శకత్వంలో శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా నటించే కొత్త చిత్రానికి (వర్కింగ్ టైటిల్ ఎస్ కే27) యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ (Sai Abhyankkar) సంగీతం సమకూర్చనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై సీనియర్ నిర్మాత టీజీ త్యాగరాజన్ సమర్పణలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ సంయు క్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో శివకార్తికేయ న్ సరసన కయదు లొహర్ (Kayadu Lohar) హీరోయిన్గా ఎంపిక చేశారు. సంగీత దర్శకుడుగా సాయి అభ్యంకర్ను తీసుకున్నారు.
దీనిపై అభ్యంకర్ ట్వీట్ చేస్తూ, 'ఎన్క27' సినిమా కోసం శివ కార్తికేయన్ అన్నతో కలిసి పనిచేయడం కోసం ఎంతో ఉత్సా హంగా ఎదురుచూస్తున్నాను. అన్నా.. మీ చిత్రాలను తొలి రోజు తొలి ఆటను చూడటం ఒక్కసారి కూడా మిస్ కాలేదు. ఇపుడు ఎస్ కే27లో ఒక కీలక భూమిక పోషిస్తుండటం ఎంతో సంతోషంగా ఉంది. ఇది థియేటర్లలో చాలా పెద్ద వేడుకగా ఉండబోతుందన్నారు.
దీనికి శివకార్తికేయన్ కూడా స్పందిస్తూ 'తంబీ.. ఈ ప్రాజెక్టులోకి నిన్ను తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మున్ముందు అనేక ప్రాజెక్టులు న్నాయి' అని పేర్కొన్నారు. ఇదిలావుంటే, శివకార్తికేయన్ నటిస్తున్న సేయోన్' చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఎస్క సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. రాజ్కమల్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించే ఈ చిత్రానికి శివకుమార్ మురుగేశన్ దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో సాగే తమిల్ యాక్షన్ డ్రామాకు కమల్ హాసన్ నిర్మాత,