సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Muppalaneni siva: కడసారి వీడ్కోలు చెప్పలేకపోయాను

ABN, Publish Date - May 08 , 2026 | 07:06 PM

సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ అధినేత ఆర్‌.బి. చౌదరి మరణవార్త తన హృదయాన్ని తీవ్రంగా కలచివేసిందన్నారు సీనియర్‌ దర్శకుడు ముప్పలనేని శివ.

సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ అధినేత ఆర్‌.బి. చౌదరి (RB Chowdary) మరణవార్త తన హృదయాన్ని తీవ్రంగా కలచివేసిందన్నారు సీనియర్‌ దర్శకుడు ముప్పలనేని శివ. సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌లో ఆయన ‘రాజా’, ‘సంక్రాంతి’ వంటి చిత్రాలను తెరకెక్కించారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ‘ఆర్‌బీ చౌదరితో పని చేయడం నా జీవితంలో ఒక గొప్ప వరంగా భావిస్తాను. ఆయన సంస్థలో తీసిన చిత్రాలు నా కెరీర్‌లో ఎప్పటికీ గర్వంగా నిలిచే మైలురాళ్లు. ఆయనతో చేసిన ప్రయాణం మాటల్లో చెప్పలేనిది. ఒకసారి కథ విన్నాక, చివరి అవుట్‌పుట్‌ వరకు అదే ఉత్సాహం, అంతే నమ్మకం.. అదే ఆయనతో ప్రత్యేకత. ఒక నిర్మాతగా ఆయన విజన్‌పై అచంచల విశ్వాసం అసాధారణం. నేను పని చేసిన నిర్మాతల్లో స్వర్గీయ రామానాయుడిగారి తర్వాత, చౌదరి గారిపై ప్రత్యేక అభిమానం, స్థానం నా హృదయంలో ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో ఉండటం వల్ల కడసారి వీడ్కోలు పలకలేకపోవడం బాధాకరం. ఇది నా హృదయానికి తీవ్రంగా మిగిలిపోయిన పెద్ద లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని పేర్కొన్నారు.

Updated Date - May 08 , 2026 | 07:08 PM