సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మిస్టర్ ఎక్స్.. సరికొత్త అనుభూతి ఇస్తుంది

ABN, Publish Date - Apr 16 , 2026 | 06:32 AM

ఆర్య, గౌతమ్ కార్తీక్ ప్రధాన పాత్రల్లో మను ఆనంద్ తెరకెక్కించిన మిస్టర్ ఎక్స్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది.

Mr. X,

'మిస్టర్ ఎక్స్ (Mr. X) చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. థియేటర్లో ఈ చిత్రం చూసేవారికి సరికొత్త అనుభూతిని ఇస్తుంది. దాదాపు మూడేళ్ల తర్వాత నేను నటించిన సినిమా తెలుగులో విడుదలవుతుండడం ఆనందంగా ఉంది. యాక్షన్, ఎమోషన్స్.. ఇలా అన్ని రకాల అంశాలు ఇందులో ఉన్నాయి. ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని తమిళ కథానాయకుడు ఆర్య (Arya)అన్నారు.

ఆయన, గౌతమ్ కార్తీక్ (Gautham Ram Karthik), శరత్ కుమార్ (R. Sarathkumar), మంజు వారియర్ (Manju Warrier) ప్రధాన పాత్రధారులుగా మను ఆనంద్ (Manu Anand) తెరకెక్కించిన చిత్రం 'మిస్టర్ ఎక్స్'. ఈ శుక్రవారం తెలుగు, తమిళ్ లో విడుదలవుతోన్న సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గౌతమ్ కార్తీక్ మాట్లాడుతూ 'ఇందులో చాలా విభిన్నమైన పాత్రలో నటించాను. అద్భుతమైన స్పై యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని మలిచాము. మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది' అని చెప్పారు. మనుఆనంద్ మాట్లాడుతూ 'ఓ క్లిష్టమైన కథను మీ అందరికీ నచ్చేలా ఈ రూపొందించాం. కచ్చితంగా మంచి థ్రిల్‌ పంచుతుంది' అని తెలిపారు.

Updated Date - Apr 16 , 2026 | 06:32 AM