సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mollywood: మలయాళ ఇండస్ట్రీ సమ్మె.. టాలీవుడ్‌ తరహాలో చేస్తే కష్టమే!

ABN, Publish Date - Jan 12 , 2026 | 04:52 PM

గత ఏడాది టాలీవుడ్‌లో (Tollywood) కార్మికుల సమ్మె మెరుపు ప్రధాన చర్చల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు నెల రోజులకు పైగా షూటింగ్‌లకు బంద్‌ ఇండస్ట్రీకి, సెట్స్‌ మీదున్న చిత్రాలు బిగ్‌ షాక్‌ ఇచ్చినట్లైంది.


గత ఏడాది టాలీవుడ్‌లో (Tollywood) కార్మికుల సమ్మె మెరుపు ప్రధాన చర్చల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు నెల రోజులకు పైగా షూటింగ్‌లకు బంద్‌ ఇండస్ట్రీకి, సెట్స్‌ మీదున్న చిత్రాలు బిగ్‌ షాక్‌ ఇచ్చినట్లైంది. ఇప్పుడు మాలీవుడ్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. సంక్రాంతి వేళ మాలీవుడ్‌ Mollywood) క్రైసిస్‌ టాక్‌ ఆఫ్‌ ద మాలీవుడ్‌గా మారింది. మలయాళ చిత్ర పరిశ్రమ జనవరి 22న రాష్ట్ర వ్యాప్తంగా భారీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ మేరకు కేరళ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇతర సినీ అనుబంధ సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సమ్మెకు (mollywood bund) ప్రధాన కారణాలు.. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం,  అదనపు పన్నులు మోపిన ప్రభుత్వ తీరుపై నిరసనగా ఈ ఆకస్మిక బందు ప్రకటించారు. ప్రస్తుతం సినిమా టికెట్లపై జీఎస్టీ భారం తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా వినోద పన్ను వసూలు చేస్తోంది. దీనిని వెంటనే రద్దు చేయాలని నిర్మాతలు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే థియేటర్ల కోసం ప్రత్యేక విద్యుత్‌ టారిఫ్‌ను అమలు చేయాలని, ప్రస్తుతం ఛార్జీలు భారంగా మారాయని, ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. సినిమా షూటింగ్‌ అనుమతుల కోసం ఒకే చోట అన్ని క్లియరెన్స్‌లు లభించేలా సింగిల్‌ విండో విధానాన్ని తీసుకురావాలనే డిమాండ్‌ కూడా వినిపిస్తున్నారు. సమ్మె పిలుపు మేరకు 22న కేరళలోని అన్ని సినిమా థియేటర్లు మూతపడతాయి. ఎలాంటి షోలు ప్రదర్శితం కావు. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అన్ని సినిమాల షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తిగా నిలిచిపోతాయి. ఈ ఒక్కరోజు సమ్మె కేవలం ఒక హెచ్చరిక మాత్రమేనని, గవర్నమెంట్‌ స్పందించకుంటే  నిరవధిక సమ్మెకు వెళ్తామని సినీ సంఘాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వం దిగి రాకపోతే సమ్మె మరింత ఉధృతంగా మారుతుందని హెచ్చరించారు.  

ఒక రోజు మించి టాలావుడ్‌ మాదిరి సమ్మె తీవ్ర రూపం దాలిస్తే, చాలా సినిమాల షెడ్యూళ్లు గందరగోళంలో పడతాయనే ఆందోళన ఉంది.  థియేటర్లు మూతపడితే ఆ మేరకు ఎగ్జిబిటర్‌రంగంతోపాటు వాటిపై ఆధారపడిన అందరికీ నష్టం వాటిల్లుతుంది. మాలీవుడ్‌ ఈ నిర్ణయం తీసుకోవడానికి 2025లో ఎదురైన భారీ నష్టాలే అని తెలుస్తోంది. ఇండస్ట్రీ నుంచి సుమారు 185 చిత్రాలు విడుదల కాగా కేవలం 10 -15 సినిమాలు మాత్రమే లాభాలు ఆర్జించాయి. పరిశ్రమ సుమారు రూ.530 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుందని ఫిల్మ్‌ ఛాంబర్‌ వెల్లడించింది. ఈ సమస్యలపై చర్చించేందుకు కేరళ ప్రభుత్వం 2026 జనవరి 14న సినీ సంఘాలతో మరో  దఫా చర్చలు జరపనుంది. ఒకవేళ ఈ చర్చలు సఫలం కాకపోతే జనవరి 22 సమ్మె ఖాయమని తెలిసింది. వినోద పన్ను తగ్గింపు సహా మాలీవుడ్‌ నిర్మాతల డిమాండ్లు సముచితంగానే ఉన్నాయి. కానీ కేరళ ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Updated Date - Jan 12 , 2026 | 04:55 PM