సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mohanlal: ఆశలన్నీ 'దృశ్యం 3' పైనే...

ABN, Publish Date - May 11 , 2026 | 01:41 PM

ఈ మధ్య కాలంలో మోహన్‌ లాల్‌కు బాక్సాఫీస్‌లో వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. హృదయపూర్వం, పేట్రియాట్‌ చిత్రాలను ప్రేక్షకులను నిరాశకు గురిచేశాయి. దాంతో అందరూ 'దృశ్యం 3'పైనే ఆశలు పెట్టుకున్నారు.

Mohanlal

మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్‌లాల్‌ (Mohanlal)కు ఉన్న ప్రేక్షకాదరణ యంగ్ హీరోస్‌కు కూడా లేదంటే అతిశయోక్తి కాదు. మలయాళీ ప్రేక్షకులు నిజానికి హీరోయిజానికంటే కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఆ రకంగా చిన్నాచితక హీరోల చిత్రాలు సైతం అక్కడ మంచి ఆదరణకు నోచుకుంటాయి. అయితే సీనియర్ స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్‌ సినిమాలకు ఇప్పటికీ సూపర్‌ రెస్పాన్స్ లభిస్తుంటుంది. దాంతో వారు ఈ వయసులోనూ హీరోలుగా నటిస్తున్నారు. అలానే ఈ నెల 21న మోహన్‌ లాల్‌ నటించిన సూపర్‌ హిట్‌ సీరిస్‌ 'దృశ్యం -3' (Drishyam 3) విడుదల కాబోతోంది. ఈ సినిమాతో మోహన్‌ లాల్‌ మరోసారి సక్సెస్ ట్రాక్‌ ఎక్కుతారనే ధీమాను ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.


ఎందుకంటే... మోహన్‌ లాల్‌ యంగ్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్‌ సుకుమారన్ రూపొందించిన 'ఎల్‌ 2: ఎంపురాన్‌' మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విడుదలైన మీడియం బడ్జెట్ మూవీ 'తుడరమ్' సైతం ప్రేక్షకాదరణ పొందింది. ఈ రెండు సినిమాలతో మోహన్ లాల్‌ ఇప్పటికీ మలయాళంలో ఎందుకు స్టార్‌ హీరోగా కొనసాగుతున్నాడో జనాలకు అర్థమైంది. అయితే ఆ తర్వాత వచ్చిన ఎమోషనల్‌ డ్రామా 'హృదయ పూర్వం' చిత్రానికి రిలీజ్‌ కు ముందు మంచి అంచనాలలు ఏర్పడ్డాయి. కానీ అది ఏవరేజ్‌గా సాగింది. అలానే తాజాగా విడుదలైన మల్టీస్టారర్ మూవీ 'పేట్రియాట్‌' మాత్రం అందరి అంచనాలను తల్లకిందులో చేసింది. మమ్ముట్టీ (Mammootty), మోహన్‌లాల్‌ చాలా సంవత్సరాల తర్వాత కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ థియేటర్లలో అది ప్రతిఫలించలేదు.


ఇలా బ్యాక్ టు బ్యాక్‌ పరాజయాలను పొందిన మోహన్‌ లాల్ తనకు అచ్చివచ్చిన 'దృశ్యం' సీరిస్‌తో తప్పకుండా తిరిగి సక్సెస్ ట్రాక్‌ ఎక్కుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఎందుకంటే 'దృశ్యం, దృశ్యం 2' చిత్రాలలో జార్జి కుట్టి (George Kutty) గా తన కుటుంబానికి రక్షణ కవచంగా నిలిచే వ్యక్తిగా మోహన్‌లాల్‌ అద్భుతంగా నటించాడు. సో... ఇప్పుడు రాబోతున్న 'దృశ్యం' మూడో భాగాన్ని కూడా దర్శకుడు జీతూ జోసెఫ్‌ అదే స్థాయితో తెరకెక్కించి ఉంటాడని అంతా నమ్ముతున్నారు. మరి నమ్మకం ఏమేరకు నిజమౌతుందో తెలియాలంటే ఈ నెల 21 వరకూ వేచి ఉండాలి.

Updated Date - May 11 , 2026 | 01:41 PM