సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mohanlal: జెట్ స్పీడులో.. మోహ‌న్‌లాల్‌! లైన్‌లో.. అర డ‌జ‌న్ సినిమాలు

ABN, Publish Date - Jan 19 , 2026 | 06:41 AM

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ (Mohanlal) జెట్ స్పీడులో దూసుకెళున్నాడు.

Mohanlal

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ (Mohanlal) జెట్ స్పీడులో దూసుకెళున్నాడు. గ‌త సంవ‌త్స‌రం ఆరు సినిమాలు రిలీజ్ చేసిన త‌న స్టామినా నిరూపించిన ఆయ‌న ఈ యేడు కూడా అదే జోరు కొన‌సాగిస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే నాలుగు చిత్రాలు ర‌న్నింగ్‌లో ఉండ‌గా తాజాగా ప్రముఖ దర్శకుడు దిలీష్‌ పోతన్ (Dileesh Pothan) కాంబినేషన్‌లో తొలిసారిగా ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది.

ఈ కొత్త సినిమా ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. ఆశిర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై ఆంటోని పెరంబవూర్‌ నిర్మించనున్నారు. ‘మహేషింటే ప్రతీకారం’, ‘తొండిముతలం ద్రిక్సాక్షియుం’ వంటి చిత్రాలతో తనదైన శైలిలో వాస్తవికాంశాలను తెరకెక్కించిన దిలీష్‌ పోతన్‌కి ఈ ప్రాజెక్టు ప్రతిష్ఠాత్మకం కానుంది. మోహన్‌ లాల్‌ ఇటీవలె ‘కథనార్‌’, ‘ఖలీఫా’ చిత్రాల షూటింగ్‌ను పూర్తి చేసుకొని సిడ్నీ వెళ్లారు.

సిడ్నీ నుంచి రాగానే తుడ‌రుం డైరెక్ట‌ర్‌ తరుణ్‌ మూర్తి (Tharun Moorthy) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఇందులో మోహన్‌లాల్‌, మీరా జాస్మిన్‌ జంటగా నటిస్తున్నారు. యాక్షన్‌ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం పూర్తి వివరాలను చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనుంది.

Updated Date - Jan 19 , 2026 | 10:27 AM