సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Priyadarshan 100: ఒకటవ సినిమా.. వందల సినిమా అతనితోనే..

ABN, Publish Date - Jan 25 , 2026 | 04:24 PM

మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌(mohan lal), మెగా డైరెక్టర్‌ ప్రియదర్శన్‌ది(Priyadarsha) సూపర్‌హిట్‌ కాంబినేషన్‌. వీరిద్దరి కలయికలో ఎన్నో హిట్‌ చిత్రాలొచ్చాయి.


మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌(mohan lal), మెగా డైరెక్టర్‌ ప్రియదర్శన్‌ది(Priyadarsha) సూపర్‌హిట్‌ కాంబినేషన్‌. వీరిద్దరి కలయికలో ఎన్నో హిట్‌ చిత్రాలొచ్చాయి. కామెడీ, ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్‌ ఇలా అన్ని రకాల జానర్‌లతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ప్రియదర్శన్‌ స్వయంగా ప్రకటించారు. దర్శకుడిగా ప్రియదర్శన్‌కి 100వ చిత్రమిది. ఆయన కెరీర్‌ మోహన్‌లాల్‌తోనే మొదలైంది.

అందుకే మొదటి చిత్రం, 100వ చిత్రం మోహన్‌లాల్‌తోనే ఉండాలని బలంగా నిర్ణయించుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో హీరోగా మోహన్‌లాల్‌ను ఎంపిక చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ‘నేను ఈ స్థాయికి చేరుకోవడంలో మోహన్‌లాల్‌ పాత్ర ఎంతో ఉంది.  అందుకే నా 100వ సినిమాను ఆయనతోనే చేయాలని నిర్ణయించుకున్నాను’ అంటూ ప్రియదర్శన్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకు కథా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలోనే షూటింగ్‌ మొదలుకానుందిని తెలుస్తోంది. మలయాళంతోపాటు ఇతర భాషల్లోనూ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్‌.  
 
 

Updated Date - Jan 25 , 2026 | 04:27 PM