Meera Vasudevan: మూడు పెళ్ళిళ్ళు చేసుకొని తప్పు చేశాను..
ABN, Publish Date - May 18 , 2026 | 04:57 PM
నటి మీరా వాసుదేవన్ (Meera Vasudevan) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఆమె గోల్ మాల్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.
నటి మీరా వాసుదేవన్ (Meera Vasudevan) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఆమె గోల్ మాల్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల ద్వారా ఫేమస్ అయ్యినదానికంటే పెళ్ళిళ్ళు, విడాకుల ద్వారానే మీరా బాగా ఫేమస్ అయ్యింది. మూడు 17 ఏళ్ళల్లో ఆమె మూడు పెళ్ళిళ్ళు చేసుకుంది. ముగ్గురికి విడాకులు ఇచ్చింది. ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో అసలు పెళ్ళి చేసుకోవడమే తప్పు అని చెప్పి షాక్ ఇచ్చింది.
' పెళ్ళి చేసుకొని తప్పు చేశాను. స్టుపిడ్ మ్యారేజెస్. పెళ్ళిళ్ళు చేసుకొని 17 ఏళ్ళు వృథా చేశాను. అసలు అర్ధమే లేని పెళ్ళి చేసుకొని అనవసరంగా సమయాన్ని వేస్ట్ చేశాను. అందుకే విడాకులు ఇచ్చేసాను. ఇప్పుడు చాలా ప్రశాంతంగా జీవిస్తున్నాను. పెళ్ళి విషయంలో ఇంకొంచెం తెలివితో అలోచించి ఉండాల్సింది. ప్రస్తుతం నాకు నచ్చిన పనులు చేస్తూ చాలా సంతోషంగా ఉన్నాను' అని మీరా తెలిపింది. ఇక మీరా వ్యాఖ్యలపై నెటిజన్స్ మండిపడుతున్నారు. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాక అది తప్పు అని తెలిసిందా.. అని ప్రశ్నిస్తున్నారు.