Dhanush Mrunal Thakur: ధనుష్‌తో పెళ్లి.. ఎట్టకేలకు మృణాల్ రెస్పాండ్
ABN, Publish Date - Jan 19 , 2026 | 05:24 AM
హీరో ధనుష్, మృణాల్ ఠాకూర్ వీరిద్దరూ ఫిబ్రవరి 14 పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే ఊహాగానాలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush)తో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) పెళ్లి ఖారారు అయిందని, ఫిబ్రవరి 14 వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే ఊహాగానాలు సామాజిక మాధ్యమాల్లో కొంత కాలంగా వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు ఏడాది క్రితమే ప్రచారంలోకి వచ్చినా, వారు ఈ వార్తలను ధృవీకరించడం గానీ, ఖండించడం గానీ చేయలేదు. అప్పటి నుంచి వీరి రిలేషన్‌షిప్‌పై వార్తలు రావడం పరిపాటిగా మారింది.
గతంలో ధనుష్ హాజరైన కొన్ని బాలీవుడ్ పార్టీలలో మృణాల్ కనిపించడం, అలాగే ఆమె నటించిన ‘సన్నాఫ్ సర్దార్ 2’ సినిమా వేడుకకు ధనుష్ హాజరవడం వంటి సంఘటనలు ఈ ఊహాగానాలకు తెర తీశాయి. అయితే తాజాగా తన పెళ్లి వార్తలపై స్పష్టతనిచ్చారు మృణాల్ ఠాకూర్. ‘వచ్చే నెలలో ధనుష్‌ను వివాహం చేసుకుంటున్నారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.
ఆమె ప్రస్తుతం సినిమాలపై పూర్తి శ్రద్ధ పెట్టారు. ఫిబ్రవరి 20న మృణాళ్ నటించిన బాలీవుడ్ సినిమా ‘దో దివానే షెహర్ మే’ విడుదలవుతోంది. మార్చిలో అడివి శేష్‌తో కలసి నటిస్తున్న తెలుగు చిత్రం ‘డెకాయిట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంత బిజీ షెడ్యూల్ మధ్య ఆమె పెళ్లి ప్రసక్తే లేదు. అవన్నీ కేవలం ఊహాగానాలే’ అని ఆమె పీఆర్ బృందం స్పష్టం చేసింది.