మండాడి.. మండాడి.. ఆ స్టెప్ లు ఏంటి సూరి అన్నా
ABN, Publish Date - Jul 18 , 2026 | 08:48 PM
వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుహాస్ (Suhas), కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సూరి(Suri) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మండాడి (Mandaadi).
వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుహాస్ (Suhas), కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సూరి(Suri) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మండాడి (Mandaadi). ఈ చిత్రానికి మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో మహిమ నంబియార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఉన్న సూరి.. హీరోగా మారి మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఇప్పుడు సూరి నుంచి వస్తున్న చిత్రం అని తెలియడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందులో సుహాస్ ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మండాడి.. మండాడి అంటూ సాగే ఈ సాంగ్ ఈ సినిమా కథను తెలియజేస్తోంది. హీరో పాత్రను, విలన్ పాత్రను లిరిక్స్ ద్వారా తెలియజేశారు. ప్రణవ్ చాగంటి అందించిన లిరిక్స్ ఎంతో మోటివేషన్ గా ఉన్నాయి. ఇక జీవీ ప్రకాష్ మ్యూజిక్.. అభినవకవి, శరత్ సంతోష్, వాహీసన్ రసయ్య వాయిస్ బేస్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. పాటలో ఆయన అందించిన పవర్‌ఫుల్ నూతన తరహా బీట్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వింటుంటేనే ఒంట్లో తెలియని ఊపు వస్తోంది. ఒక వైపు యాక్షన్ ఎలిమెంట్స్, మరోవైపు లోకల్ నేటివిటీ ఉట్టిపడేలా విజువల్స్ కనిపిస్తున్నాయి.
అసలు ఈ సాంగ్ కి హైలైట్ అంటే.. సూరి డ్యాన్స్. ఒక స్టార్ హీరో రేంజ్ లో సూరి స్టెప్స్ ఉన్నాయి. ముఖ్యంగా సిగ్నేచర్ స్టెప్స్ కి అయితే ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సూరి, సుహాస్ ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటే అలా చూస్తుండిపోయేలా ఉంది అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఒకప్పుడు సూరిలోని కమెడియన్ కి ఫ్యాన్స్ అయిన అభిమానులు.. ఇప్పుడు ఈ డ్యాన్స్ కి ఫ్యాన్స్ అయ్యామని, అసలు ఊహించలేదు అని అంటున్నారు. మాస్ లుక్ లో ఊర మాస స్టెప్స్ వేసి సూరి, సుహాస్ అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సూరి, సుహాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.